బిగ్ బాస్-5 కి ముహూర్తం ఫిక్స్! కంటెస్టెంట్లు వీరే!

బిగ్ బాస్ .. తెలుగు ప్రేక్షకులకు రియాల్టీ షోలోని అసలైన మాజాని అందించిన పోగ్రామ్ ఇది. జూనియర్ యన్టీఆర్ తెలుగు నాట ఈ షోకి సేఫ్ లాంచింగ్ ఇవ్వగా, అక్కడ నుండి నాగార్జున షోని పర్ఫెక్ట్ గా హోస్ట్ చేస్తూ వస్తున్నారు. మధ్యలో నాని ఒక సీజన్ లో మెరిసినా.. తరువాత నుండి పర్మినెంట్ హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అయిపోయాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి చాలా కాలం అవుతోంది. దీంతో.., కొంత కాలంగా ప్రేక్షకులు సీజన్-5 ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.., త్వరలోనే ఈ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి బిగ్ బాస్ సీజన్ 5 రెండు నెలలు ముందే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.., కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఐదో సీజన్ను షురూ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట నిర్వాహకులు. ఇందులో భాగంగా ఇప్పటికే అందులో పాల్గొనబోయే కొంతమంది కంటెస్టెంట్స్ కి జూమ్ ద్వారా ఇంటర్వ్యూ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. దీంతో.., షో నిర్వాహకులు మరో రెండు వారాలలో ఫైనల్ కంటెస్టెంట్స్ను ఖరారు చేసి, వారిని క్వారంటైన్ కి తరలించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

big 2వీరి క్వారెంటైన్ పూర్తి అయ్యాక సీజన్ 5 గ్రాండ్ గా మొదలు కానుందట. అందుతున్న సమాచారం ప్రకారం జూలై రెండో వారంలో బిగ్బాస్ ఐదో సీజన్ ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా.. నేపథ్యంలో ప్రజలకి ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. దీంతో కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారట. ప్రజల్లో బాగా పేరున్న వారిని మాత్రమే ఈసారి షోలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, టిక్టాక్ స్టార్ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్ ప్రవీణ్, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష వంటి వాళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బయట ఈవెంట్స్ అస్సలు లేవు. షూటింగ్స్ కూడా ఎప్పుడు మొదలవుతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంచి స్టార్స్ డేట్స్ అడ్జెస్ట్ అవ్వొచ్చన్న ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు. ఇక షోని కూడా 100 రోజులకి పైగానే ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 4 ని కరోనా సమయంలోనే సమర్ధవంతంగా నడిపించగలిగారు. ఆ ధైర్యంతోనే యాజమాన్యం ఎక్కడా తగ్గకుండా సీజన్-5 ప్లాన్ చేసుకుంటుందట. ఈ లెక్కన చూసుకుంటే బిగ్ బాస్ ప్రేక్షకులకి ఈసారి మంచి ఎంటర్టెన్మెంట్ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి.. మీలో ఎంత మంది బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఎదురుచూస్తున్నారు? అలాగే.., కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.