బిగ్‌ బాస్‌ లో దారుణమైన టాస్క్.. రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ

Bigg boss 5 telugu contestent vishwa gets emotional - Suman TV

తెలుగు బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. 19 మందిని కంటెస్టెంట్స్ తో హౌస్ కళకళలాడిపోతోంది. మరి.. ఇంత మంది కళ్ళ ముందు ఉంటే బగ్ బాస్ టాస్క్ లు ఇవ్వకుండా ఉంటారా? దారుణమైన టాస్క్ లు ఇస్తూ.., హౌస్ మేట్స్ ని వణికిస్తున్నాడు బిగ్‌ బాస్‌. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఈ విషయం అర్ధం అవుతోంది.

సీజన్ లో తొలిసారి పవర్‌ రూమ్‌ని పరిచయం చేశాడు బిగ్‌ బాస్‌. దీన్ని విశ్వ గెలుచుకున్నాడు. విశ్వని పవర్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ మీరు ఎంచుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా.., అన్ని వస్తువులని స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని టాస్క్ ఇచ్చాడు. ఇలా యాంకర్ రవి, ప్రియ బుక్ అయిపోయారు. దీంతో యాంకర్‌ రవి బట్టలన్నీ స్టోర్ రూమ్ లోకి వెళ్లిపోవడంతో.. లేడీస్‌ డ్రెస్‌ లో కెమెరా ముందుకి వచ్చాడు.

Bigg boss 5 telugu contestent vishwa gets emotional - Suman TVఈ సందర్భంగా రవి.. నీకోసం ఏమైనా చేస్తా అనడంతో విశ్వ ఎమోషనల్ అయ్యాడు. “పోయిన ఏడాది నా బ్రదర్ చనిపోయాడు. వాడు కూడా నీ కోసం ఏమైనా చేస్తా అంటుండేవాడు” అంటూ..  తన బ్రదర్ ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు విశ్వ. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారిలో రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఉన్న విషయం తెలిసిందే.