తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో సెకండ్ కంటెస్టెంట్ గా.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు వీజే సన్నీ. దీంతో.. ఇప్పుడు ఈ వీజే సన్నీ ఎవరంటూ.. అతని వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి.., ఇప్పుడు మనం వీజే సన్నీ బయోడేటా పై ఓ లుక్ వేద్దాం.
వీజే సన్నీ. మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తరువాత వీజేగా చాలా ఏళ్ళు కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ఆ తరువాత యాంకర్ గా కూడా కొన్ని షోలలో మెరిశాడు. ఇలా వచ్చిన ఫేమ్ తోనే సన్నీకి సీరియల్స్ లో అవకాశం లభించింది. అయితే.., ‘కళ్యాణ వైభోగమే’ సీరియల్ లో మంచి పాత్ర లభించడంతో వీజే సన్నీ కాస్త.. ఆర్టిస్ట్ సన్నీగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం కూడా సీరియల్స్ లో సన్నీకి బాగానే అవకాశాలు లభిస్తున్నాయి.
సన్నీకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. ఇతనికి బుల్లితెర జూనియర్ ఎన్టీఆర్ అని పేరు. ఇక ‘సకలగుణాభిరామ’ సినిమాలో కూడా నటించాడు సన్నీ. ఇక పులిహోర కలపడంలో కింగ్ అయిన సన్నీకి అచ్చ తెలుగమ్మాయే భార్యగా రావాలని కోరిక ఉంది. అంచనాలు కరెక్ట్ అయితే.., సన్నీ బిగ్ హౌస్ లోనే జోడీని వెతుక్కోవడం ఖాయం. మరి.. మల్టీ టాలెంటెడ్ అయిన సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.