తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున.. అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆర్జే కాజల్ మల్టీ టాలెంటెడ్. బతుకు నావని ముందుకు నడిపించడానికి క్రియేటివ్ ఫీల్డ్ లో ఈమె చేయని పని లేదు. ఆర్జేగా, యూట్యూబర్ గా, వీడియో జాకీగా సింగర్ గా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కాజల్ చాలానే కష్టాలు పడింది. అయితే.., ఈ పనులన్నీ కాలం గడవడానికి పనికొచ్చాయి గాని, కావాల్సినన్ని కాసులు మాత్రం కురిపించలేకపోయాయి.
ఇక ప్రేమ వివాహం చేసుకుని ఈ అమ్మడు చాలానే ఆర్థిక కష్టాలను అనుభవించింది. ఉపాధి చాలని ఆకలి రోజులు ఈమె జీవితంలో చాలానే ఉన్నాయి. అయితే.., ఇన్ని కష్టాలకి ఓర్చి కూడా, కోరుకున్న వాడితో ఓ మంచి జీవితాన్ని లీడ్ చేస్తూ వస్తోంది ఆర్జే కాజల్. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఆఫర్ కాజల్ ఆర్ధిక కష్టాలు అన్నీ తీర్చేయబోతుంది. మరి.. ఎన్నో ఆశల నడుమ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలదు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)