బిగ్ బాస్-5 కంటెస్టెంట్ 9.. జబర్దస్త్ ప్రియాంకా సింగ్ లైఫ్ స్టోరీ

Bigg Boss 5 Telugu Contestant Jabardasth Priyanka Singh Biography in Telugu -Suman TV

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 9వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ప్రియాంక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు ప్రియాంక వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

మీకు ప్రియాంక గురించి తెలియాలంటే.. ముందుగా జబర్దస్త్ సాయితేజ గురించి తెలియాలి. చదవడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.., ఇదే నిజం.జబర్దస్త్‌ లో లేడీ గెటప్‌తో ఆకట్టుకున్న ఆ సాయితేజనే ఈ ప్రియాంక. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసి అలవాటు అయ్యిందో, లేదా స్వతహాగా అతనికి అలా అనిపించిందో తెలియదు గాని.., సాయితేజ ఆపరేషన్ చేయించుకుని మరీ.., ప్రియాంకాగా మారాడు. సారీ మారింది. ఇప్పుడు అతను ప్రియాంక సింగ్‌గా మారిపోయాడు.

Big Boss 01 copy min 1పేరు మార్చుకుని అతడు కాస్తా ఆమెగా రూపాంతరం చెందాడు. అయితే నేనిలా జెండర్‌ మార్చుకున్నానన్న విషయం తన తండ్రి బీబీ సింగ్‌కు ఇప్పటికీ తెలీదని పేర్కొంది. ఈమెది శ్రీకాకుళం. వివరంగా చెప్తే ఈమె జీవితంలో కార్తీక దీపం సీరియల్ లో ఉన్నన్ని కష్టాలు, అవమానాలు, బాధలు ఉన్నాయి. మరి జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని.., తనని తాను నిరూపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రియాంకా సింగ్.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలదు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)