రజినీ కాంత్ ఫ్యాన్స్ పై యాంకర్ రష్మీ ఫైర్..!

rashmi rajinikanth

రజినీ కాంత్.. తెలుగు, తమిళ్.. ఇలా భాషలతో సంబంధం లేకుండా దక్షిణాది వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తన నటనతో అనేక అవార్డులు, రివార్డులు అందుకుని చెరిగిపోని పేరును లిఖించుకున్నాడు రజినీ కాంత్. అయితే ఇప్పటికీ అనేక సినిమాల్లో నటిస్తూ జోరును ఏ మాత్రం తగ్గించట్లేదు. ఇక ఈ మధ్య కాలంలో రజినీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ మళ్లీ వెనక్కి తగ్గారు.

ఇక విషయం ఏంటంటే..? రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం అన్నాత్తే. ఈ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ఇటీవల రెండు పోస్టర్ లను విడుదల చేసింది. అదరిపోయే లుక్స్ లోఆకట్టుకుంటుండటంతో రజినీ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం కాస్త శృతిమించారనే చెప్పాలి. ఏకంగా మేక తలను నరికి ఆ రక్తంతో రజనీ కాంత్ పాదాలకు అభిషేకం చేశారు. ఇక ఇలా చేయటంపై కొందరు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూగజీవాలపై ఇలాంటి ప్రయోగాలేంటంటూ దుమ్మెత్తిపోశారు. ఇక ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెర యాంకర్ రష్మీ కూడా తనదైన శైలీలో ట్విట్టర్ లో స్పందించి కాస్త ఫైర్ అయ్యారు. ఏ హీరో కూడా ఇలాంటి రాక్షస అభిమానాన్ని కోరుకోడని, మీరు ఇలాంటి పనులకు మీరు ఇలాంటి పనులు చేసి హీరోలకు చెడ్డ పేరు తేకూడదంటూ ఫైర్ అయ్యారు. ఇక రష్మీ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.