యాంకర్ రష్మీ చాలారోజులకు ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. బీచ్ వెకేషన్ కు వెళ్లడంతోపాటు నిక్కర్ తో కొన్ని ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.
యాంకర్ రష్మీ అనగానే సుడిగాలి సుధీర్ పేరు కచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ, బాండింగ్ అలాంటిది. ‘జబర్దస్త్’తో మొదలైన వీళ్ల జర్నీ.. ఇప్పటికే అలానే కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం రష్మీ.. పలు షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అదే టైంలో వీలు దొరికినప్పుడల్లా టూర్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ బీచ్ వెకేషన్ కు వెళ్లింది. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్మీని చాలారోజుల తర్వాత కొత్త లుక్ లో చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ బాగా పరిచయమైన వ్యక్తిగా మారిపోయింది రష్మి. స్వతహాగా నటి అయిన ఈమె.. పలు చిత్రాల్లో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ‘జబర్దస్త్’ షోకి యాంకర్ అయ్యిందో అప్పటి నుంచి ఈమె లక్కే మారిపోయింది. హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం బుల్లితెర స్టార్ యాంకర్స్ లో ఒకరిగా క్రేజ్ సంపాదించింది. ఈమె తాజాగా మాల్దీవులు లేదంటే పాండిచ్చేరి వెళ్లిందో తెలియదు కానీ కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. ఇన్ స్టాలో ఇవి రష్మీ ఫ్యాన్స్ పుల్ గా అలరిస్తున్నాయి.
బీచ్ దగ్గర నిక్కర్ లో పోజిలిచ్చిన రష్మీ.. కిస్ ఇస్తున్నట్లు క్యూట్ గా నెటిజన్స్ ని కవ్విస్తోంది. కొన్ని ఫొటోలు బీచ్ దగ్గర తీసుకోగా, మరికొన్ని సిటీలో రోడ్ సైడ్ నిల్చుని తీసుకుంది. ఇలా అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇచ్చే రష్మీపై అభిమానులు అదే రీతిలో ప్రేమ చూపిస్తుంటారు. ఈ పోస్ట్ దిగువన కూడా సుధీర్ పేరుతో కామెంట్స్ కాస్త ఎక్కువగానే కనిపించాయి. ఓ నెటిజన్ అయితే. ‘మీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడిగాడు. సరే ఇదంతా పక్కనబెడితే రష్మీ నిక్కర్ తో ఇచ్చిన పోజులు చూస్తే మీకేం అనిపించింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.