భర్తతో గొడవలపై స్పందించిన సుమ! విడిపోవడం సులభమే అంటూ..!

Conflicts with Rajiv are real! suma

యాంకర్‌ సుమ.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గలగల మాట్లాడుతూ.. అదరగొట్టే పంచ్‌లు విసురుతూ.. షోపై ప్రేక్షకులకు ఆసక్తి పెంచడంలో సుమ ఎక్స్‌పర్ట్‌. ఇక సుమ యాంకర్‌గా టీవీ షోలు, ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌ చేస్తూ.. మరో వైపు యూట్యూబ్‌లో కూడా తన సొంత చానల్లో వీడియోలు చేస్తూ.. నిమిషం గ్యాప్‌ లేకుండా ఫుల్‌ బిజీగా ఉంటుంది. ఇవే కాక తాజాగా జయమ్మ పంచాయతీ సినిమాలో నటించింది సుమ. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చింది సుమ. మే 2, 2022న ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: హీరో శ్రీకాంత్ అరిచాడు! ఆ రేప్ సీన్ ఇబ్బంది పెట్టింది: హీరోయిన్ మాళవిక

దీనిలో సుమ సినిమాలు, తన కొడుకు హీరో ఎంట్రీ వంటి విషయాల గురించి మాట్లాడింది. ఈ క్రమంలో ఆలీ.. గతేడాది సుమ, రాజీవ్‌ విడిపోతున్నారంటూ వచ్చిన వార్తల గురించి ప్రశ్నించాడు. వీటికి సుమ ఏ మాత్రం తొణకకుండా సమాధానం చెప్పారు. ఇద్దరి మధ్యలో గొడవలు అనేది వాస్తవమే.. ఈ 23 ఏళ్లలో ఎన్ని గొడవలో.. కానీ ఒకటి మాత్రం నిజం.. భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం సులభమే కానీ.. తల్లిదండ్రులుగా మాత్రం చాలా కష్టమని సుమ చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రోమోను మాత్రం కాస్త కాంట్రవర్సీగా కట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆలీ ప్రశ్నకు సుమ ఏం సమాధానం చెప్పిందో తెలియాలంటే.. ఎపిసోడ్‌ ప్రసారం అయ్యేవరకు ఎదురు చూడాలి.

 Conflicts with Rajiv are real! suma

ఇది కూడా చదవండి: నన్ను చూడగానే.. నోటితో పలకలేని బూతులు తిట్టారు: అమిత్‌ తివారి

అయితే సుమ-రాజీవ్‌ల గురించి నిత్యం ఏదో ఓ రూమర్‌ వస్తూనే ఉంటుంది. కరోనా సమయంలో వీరిద్దరు విడాకులు తీసుకున్నారనే వార్తలపై రాజీవ్‌ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. చిన్న చిన్న గొడవలు జరిగిన మాట వాస్తవమే.. భార్యభర్తలన్నాక గొడవలు సహజమే.. కానీ మీడియాలో చెప్తున్నంత పెద్ద పెద్ద గొడవలు మాత్రం కాదని స్పష్టం చేశాడు. ఇక తాజాగా విడాకులు రూమర్లపై సుమ కూడా స్పందించింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఎంత చెప్పినా తక్కువే.. మరో మంచి పని చేసిన సూర్య..


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.