తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘ఆలీతో సరదాగా’ ఒకటి. సీనియర్ నటుడు ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సెలబ్రిటీ టాక్ షో.. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ కి తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే.. తెరపై కనిపించి కనుమరుగైన ఎంతోమంది సెలబ్రిటీలను ఈ షో.. మరోసారి వారిని చూసే అవకాశము కల్పిస్తోంది. వారవారం కొత్త గెస్ట్ లతో వినోదాన్ని పంచుతున్న ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి సంబంధించి కొత్తగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి షోలో యంగ్ టాలెంట్ సోహెల్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు.
ఇక బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన సోహెల్.. సింగర్ గా క్రేజ్ ఉన్న రాహుల్ ఇద్దరూ తమ లైఫ్ స్ట్రగుల్స్, కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితాల గురించి కూడా చర్చించారు. బిగ్ బాస్ తర్వాత సోహెల్ హీరోగా సినిమాలు చేస్తుండగా.. రాహుల్ సినిమా పాటలతో పాటు బయట వ్యాపారాలలో కూడా రాణిస్తున్నట్లు తెలిపాడు. అయితే.. హోస్ట్ ఆలీ.. “ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళావంట కదా.. ఎందుకు?” అని సోహెల్ ని అడిగాడు. దీంతో ఎమోషనల్ అయిన సోహెల్.. ‘ఎందుకంటే సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు. నాకేం చేయాలో అర్థంకాక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఏం చేసినా సెట్ అయితలేదు ఇంతేనా లైఫ్’ అని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.