టెలివిజన్ రంగంలో తనదైన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించింది యాంకర్ సుమ. ఒక రకంగా చెప్పాలంటే యాంకర్ సుమ లేని టీవీ షో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఊహించడం కష్టమని అంటారు అభిమానులు.
తెలుగు బుల్లితెరపై తన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాస్తవానికి సుమ ది కేరళ మాతృ భాష అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు.. స్టార్ హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా ఈమె యాంకరింగ్ చేయాల్సిందే.. అంతగా క్రేజ్ తెచ్చుకుంది సుమ. ఒక రకంగా చెప్పాలంటే సుమ లేకుండా టీడీ షోలను, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ఊహించుకోవడం కష్టం. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో రాజీవ్ కనకాల-సుమ కలిసి నటించారు.. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దల సమక్షంలో 1999, ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నారు.
నేడు రాజీవ్ కనకాల-సుమ పెళ్లి రోజు. గతంలో సోషల్ మీడియాలో ఈ జంటపై రక రకాలు రూమర్లు పుట్టుకొచ్చాయి. వీరిద్దరి మద్య దూరం పరిగిపోయిందని.. విడాకులు తీసుకుంటున్నారని రూమర్లు రావడం.. వాటిని ఖండించడం చూస్తూనే ఉన్నాం. తమ మధ్య మంచి సత్సంబంధాలే ఉన్నాయి బాబో అంటూ సుమ ఎన్నోసార్లు తన సోషల్ మాధ్యమాల్లో షేర్ చేశారు. తాజాగా సుమ-రాజీవ్ 24వ పెళ్లి రోజును వెరైటీగా సెలెబ్రేట్ చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే చోట లేకపోవడంతో వీడియో కాల్ ద్వారా పాట రూపంలో తమ 24 ఏళ్ల అనుబంధాన్ని పంచుకున్నారు. ‘నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటిక్కడ.. పలుకక్కడా అంటూ సుమ పాడింది.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా అంటూ రాజీవ్ కనకాల పాడారు.’
ఈ ఒక్క వీడియో చాలు సుమ-రాజీవ్ 24 ఏళ్ల వివాహ బంధం ఎంత అన్యోన్యంగా ఉందో అని అంటున్నారు నెటిజన్లు. ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నా.. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుందని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంత కాలంగా ఈ జంటపై సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్ రావడం.. వాటిపై రాజీవ్ కనకాల సీరియస్ కావడం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద సెలబ్రెటీ కుటుంబంలో అయినా భార్యాభర్తల మద్య చిన్న చిన్న తగాదాలు ఉంటాయి.. అవి కొంతకాలనికే సమసిపోతాయి.. మేం ఇద్దరం విడిపోయేంత పెద్ద గొడవలు ఎప్పుడూ కాలేదు అని క్లారిటీగా చెబుతుంటారు రాజీవ్ కనకాల. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.