యానాంకు చెందిన అబ్బాయి.. ఫ్రాన్స్‌కు చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒకే చెప్పారు. తాజాగా, వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. యాంకర్ సుమ కనకాల ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఓ దేశం అమ్మాయి లేదా అబ్బాయి.. వేరే దేశానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయిని ప్రేమించటం కొత్త కాదు. ఖండాంతరాలు దాటిన ప్రేమ కథలు చాలా ఉన్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అబ్బాయి, ఫ్రాన్స్‌కు చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి యాంకర్ సుమ దంపతులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాంకు చెందిన చింతా వెంకట్, వేద దంపతులు చాలా ఏళ్ల క్రితమే ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. వెంకట్, వేద దంపతులకు ఓ కుమారుడు సుమంత్ ఉన్నాడు. అతడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన క్లమెన్‌టైన్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు.
తర్వాత ఇద్దరూ తమ ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పారు. పెద్దలు వీరి పెళ్లికి అడ్డు చెప్పలేదు. అయితే, సుమంత్, క్లమెన్‌టైన్ పెళ్లిని సొంతదేశంలోని తమ స్వగ్రామంలో చెయ్యాలని నిశ్చయించుకున్నారు. అది కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఆదివారం వీరి పెళ్లి వేడుక యానాంలోని గాజుల గార్డెన్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ పెళ్లికి పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు తరపు వారు పెద్ద ఎత్తున వచ్చారు. వీరితో పాటు ప్రముఖ యాంకర్ సుమ కనకాల దంపతులు కూడా వచ్చారు. కొత్త జంటను ఆశీర్వదించారు. మరి, తెలుగు అబ్బాయి, ఫ్రాన్స్ అమ్మాయి పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.