నేను కోలుకుంటున్నా, ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా-బన్నీ

Allu Arjun
ALLU ARJUN

ఫిల్మ్ డెస్క్- కరోనా బారిన పడిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ కోలుకుంటున్నారట. ఇటీవల కొవిడ్ సోకిన బన్నీఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని ట్విట్టర్‌ వేదికగా అల్లు అర్జున్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయనొక పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలున్నాయి.. మెల్లగా కోలుకుంటున్నా.. ఆరోగ్యం బాగుంది.. ఇంకా  క్వారంటైన్‌లోనే ఉన్నాను.. నాపై ప్రేమ చూపిస్తూ, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా.. అని బన్నీ పేర్కొన్నారు.

unnamed 1
ALLU ARJUN ACTOR

ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఐతే అల్లు అర్జున్ కు కరోనా సోకడం వల్ల షూటింగ్‌ నిలిచిపోయింది. గత షెడ్యూల్‌లో అల్లు అర్జున్ కేవలం రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొని ఉంటే పుష్ప సినిమా యాక్షన్ పార్ట్ ఫినిష్ అయ్యేదని యూనిట్ చెబుతోంది. మళ్లీ బన్నీ పూర్తిగా కోలుకున్నాకే పుష్ప షూటింగ్ మొదలుకానుంది.