ఐపీఎల్ 2022లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఒక కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో 62 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఇది స్లో ఇన్నింగ్స్ అయినప్పటికీ.. లక్నో బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో శుభ్‌మన్ ఆచీతూచి ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో ఇన్నింగ్స్ మొత్తం ఆడి ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా ఉన్న రెండో బ్యాటర్‌గా గిల్ రికార్డులకెక్కాడు.
గతంలో సచిన్ టెండూల్కుర్ ఇలాంటి ఇన్నింగ్సే ఒకటి ఆడాడు. పైగా సచిన్ ఆడిన ఇన్నింగ్స్‌కు, ఇప్పుడు గిల్ ఆడిన ఇన్నింగ్స్‌కు దాదాపు సేమ్‌గా ఉంది. ఏప్రిల్ 18, ఐపీఎల్ 2009లో సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున చెన్నై సూపర్ కింగ్స్‌తో సనత్ జయసూర్యతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 49 బంతుల్లో 59 పరుగులతో 20 ఓవర్లు ఆడిన సచిన్ నాటౌట్‌గా నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు కొట్టాడు. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. 120.40 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఛేదనలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 19 పరుగుల తేడాతో ముంబై గెలిచింది.మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కూడా గిల్ 49 బంతులే ఎదుర్కొన్నాడు. 7 ఫోర్లే కొట్టాడు, ఒక్క సిక్స్ కూడా లేదు. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ జట్టు విజయం సాధిస్తే.. ఇక్కడ కూడా గిల్ టీమ్ గుజరాత్ విజయం సాధించింది. ఇలా అచ్చం సచిన్ ఇన్నింగ్స్‌లానే గిల్ ఇన్నింగ్స్ కూడా ఉండడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గిల్ సచిన్‌కు పెద్ద ఫ్యాన్.. 2009 ఐపీఎల్‌లో సచిన్ ఆ ఇన్నింగ్స్ ఆడిన సమయంలో గిల్‌కు పదేళ్లు కూడా ఉండవేమో.. ఎందుకంటే ఇప్పుడు గిల్ వయసు 22 ఏళ్లు మాత్రమే. తన ఆరాధ్య క్రికెటర్ ఇన్నింగ్స్‌ను మళ్లీ తానే రిపీట్ చేయడంపై గిల్ కూడా సంతోషంగా ఉన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: IPL ప్రదర్శనతో కోహ్లీ సామర్థ్యాన్ని డిసైడ్ చేయడం అంటే అవమానించడమేనా?
There was an uncanny resemblance between Shubman Gill’s knock vs LSG and one of Sachin Tendulkar’s IPL knocks vs CSK in 2009 | #GTvsLSG #IPL2022 https://t.co/nMC4Ofe69h
— India Today Sports (@ITGDsports) May 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.