షుగర్ పేషంట్స్ కి కరోనా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మధుమేహం.. ఒక్కసారి ఈ వ్యాధి వస్తే మనిషి సగం జీవితం తలక్రిందులు అయినట్టే. అప్పటి వరకు ఇష్టం వచ్చింది తింటూ.., ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ వచ్చిన లైఫ్ స్టయిల్ కి బ్రేకులు వేయాల్సిందే. ఒక్కసారి చక్కెర వ్యాధి వచ్చాక.., చక్కగా జీవితాన్ని ప్లాన్ చేసుకోకుంటే మొదటికే మోసం వస్తుంది. దీంతో.., ఇప్పుడు చాలా మంది షుగర్ పేషంట్స్ తప్పక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డాక్టర్స్ ప్రిస్కిప్షన్స్ ఫాలో అవుతూ.., తగిన వ్యాయామాలు చేస్తూ.., షుగర్ లెఫ్వల్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవడనికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.., కరోనా మహమ్మరితో షుగర్ పేషంట్స్ కి పెద్ద తలనొప్పులు వచ్చి పడ్డాయి. సాధరణ వ్యక్తికి కరోనా సోకితే.., బాడీలో ఇన్ఫెక్షన్ తగ్గి, యాంటీ బాడీస్ జనరేట్ అయ్యే వరకు మాత్రమే ఇబ్బంది. కానీ.., షుగర్ పేషంట్స్ విషయంలో ఇలా కాదు. పోస్ట్ కరోనా సమయంలో కూడా వీరు జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. మరి కరోనా సమయంలో షుగర్ పేషంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

covid 19 21) కరోనా నుండి కోలుకున్న, కోలుకుంటున్న షుగర్ పేషంట్స్ తాము రోజూ తీసుకునే ఇన్సులిన్ లేదా? షుగర్ టాబ్లెట్స్ ని ఎట్టి పరిస్థితిల్లో ఆపకూడదు. చాలా మంది.. కరోనా కారంణంగా ఇప్పటికే చాల మెడిసిన్స్ తీసుకుంటున్నాము కదా అని.. ఈ షుగర్ మెడిటేషన్ ని మిస్ చేస్తున్నారు. కానీ.., ఇది చాలా ప్రమాదకరం.

2) కరోనా సమయంలో షుగర్ పేషంట్స్ యాంటీ బయాటిక్స్ విచ్చలవిడిగా వాడకూడదు. ముఖ్యంగా అజిత్రోమైసిన్ లాంటి టాబ్లెట్స్ కి దూరంగా ఉండాలి. అవసరమైనంత మేర డాక్టర్స్ మాత్రమే షుగర్ పేషంట్స్ యాంటీ బయాటిక్స్ అందిస్తారు.

3) కరోనా సమయంలో షుగర్ రీడింగ్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆహరం తీసుకోకముందు, తీసుకున్న తరువాత రీడింగ్స్ నోట్ చేసుకోవాలి. వీటిలో ఏదైనా అనూహ్య పెరుగుదల, తగ్గుదల కనిపిస్తే వెంటనే మీ ఫిజీషియన్ ని సంప్రదించాల్సి ఉంటుంది.

4) ఇక ఇలాంటి సమయంలో సరైన డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ వ్యాధిగ్రస్తులు ముందుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం అన్ని పోషకాలు అందే సంపూర్ణ, సమతులాహారం తీసుకోవాలి. రోజుకు మూడు పూటల కాకుండా.. తక్కువ పరిమాణాల్లో ఎక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి.

5) కరోనా సమయంలో ఎలాంటి వ్యాయామాలు చేయకండి. అలా చేస్తే కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని శరీరానికి ఆక్సిజన్ స్థాయి మరింత అవసరం అవుతుంది. కాబట్టి.., కేవలం మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి చాలు.