మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు అస్సలు చేయకూడదట!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగకు ఉన్న ప్రాముఖ్యత వేరనే చెప్పాలి. కోడి పందాలతో, కొత్త అళ్లుళ్లతో ఆ మూడు రోజులు ఇళ్లంత పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా హిందు సంప్రదాయం ప్రకారం ఈ మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉందని హిందూ మత గ్రంధాలు తెలియజేస్తున్నాయి. ఈ పండుగ రోజున చాలామంది సూర్య భగవానుడు, శని దేవుడిని పూజిస్తారు. గంగాస్నానం, ఉపవాసం, కథ, దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం నెలకొంటుందని చాలా మంది ప్రజలు విశ్వాసిస్తూ ఉంటారు. అయితే ఈ పండగ సందర్భంగా చాలామంది వరి, శనగ, వేరుశనగ, బెల్లంతో తయారు చేసిన పదర్ధాలను దేవుళ్లకు నైవేద్యంగా పెట్టి పూజిస్తూ ఉంటారు. మకర సంక్రాంతి రోజు ఇలా చేస్తే దేవుడు కరుణిస్తాడని ప్రజల నమ్మకం. ఇక మకర సంక్రాంతి రోజున చేయాల్సిన పనులే కాకుండా చేయకూడని పనులు కూడా ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

sakj min

మకర సంక్రాంతి రోజు చేయకూడని పనులు:

  • సంక్రాంతి పండగ పూట చాలా మంది గంగిరెద్దులు తీసుకుని సాయం చేయాలంటూ ఇంటి ముందుకు వస్తూ ఉంటారు. ఇక వీళ్లే కాకుండా బిచ్చగాళ్లు, పేదవారు అడుకునేందుకు ఇంటికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిని ఉట్టి చేతులతో అస్సలు పంపకూడదట.
  • మకర సంక్రాంతిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. కనుక ఆ రోజు ప్రతి ఒక్కరు మద్యానికి దూరంగా ఉండాలని హిందు మత పెద్దలు సూచిస్తున్నారు.
  • ఇక ఉపవాసం చేసేవారు కొన్ని నియమాలు పాటించాలని కూడా చెబుతున్నారు. స్నానానికి, పూజకు ముందు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదట. మకర సంక్రాంతి రోజు పైన తెలిపిన పనులు తప్పక పాటించాలని హిందు మత గ్రంధాలు చెబుతున్నాయి.