Vrushabha Rasi (Taurus) Ugadi Telugu Panchagam 2023: ఉగాది వచ్చేసింది. శోభకృత్ నామ సంవత్సరంలోకి మీరు అడుగుపెట్టేశారు. అందరి రాశిఫలాలతో మేం వచ్చేశాం. ఇందులో భాగంగా వృషభరాశి వాళ్లకు ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం!
కొత్త సంవత్సరం అనగానే చాలామంది జనవరి 1వ తేదీ అనుకుంటారు. కానీ అది తప్పు. తెలుగువాళ్లకు ఉగాది నుంచి కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే మనలో చాలామంది రాశిఫలాలు చెప్పించుకుంటారు. ఎవరైనా ఆస్ట్రాలజర్స్ చెబితే శ్రద్ధగా వింటూ ఉంటారు. అయితే ఒక్కొక్క రాశివాళ్లకు ఒక్కోలా జాతకం ఉంటుంది. ఇప్పుడు మేం చెప్పబోయేది వృషభరాశి వారికోసం. సాధారణంగా ఎప్పుడు కష్టాలు వచ్చే ఈ రాశివాళ్లకు ఈ ఏడాది బాగా కలిసి వస్తుందని ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి చెప్పుకొచ్చారు. అలానే ఏడాది మొత్తంలో ఇంకా ఏమేం జరగబోతుందనేది పూసగుచ్చినట్లు పేర్కొన్నారు.
శోభకృత్ నామ సంవత్సరం అంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సత్ఫలితాన్ని అనుభవించే సమయమని అర్థం. అలానే భోగభాగ్యాలు ఇచ్చేది కాబట్టి దీనికి శోభకృత్ నామ సంవత్సరం అని పిలుస్తారు. వృషభరాశి వారి విషయానికే వస్తే.. వీళ్లకు 11వ స్థానంలో గురుడు ఉన్నాడు. 10వ స్థానంలో శని ఉన్నాడు. శని 3,6,10,11వ స్థానంలో కలిసి వస్తాడు. గురుడు 11వ స్థానంలో అద్భుతంగా కలిసి వస్తాడు. కాబట్టి ఈ ఏడాది వృషభరాశి వారికి గురు, శని ఇద్దరూ అనుకూలిస్తారు. పాజిటివ్ ఇచ్చేది గురు గ్రహం, నెగిటివ్ ని ఇచ్చేది శని గ్రహం. అయితే నెగిటివ్ ఇచ్చే శని కూడా ఈసారి వృషభరాశి వాళ్లకు పాజిటివ్ గా మారనుంది. ఈ ఏడాది నంబర్ వన్ లో ఎవరున్నారు అంటే వృషభరాశి వాళ్లే. మీకు కాలం కలిసొస్తుంది. నాకు కాలం కలిసి వస్తుంది కదా అని ఇంట్లోనే కూర్చుంటే.. ఈ సంవత్సరం అలా వెళ్లిపోతుందే తప్ప ఒక్క రూపాయి లాభం ఉండదు.
సాధారణంగా ఎప్పుడూ వృషభరాశి వాళ్లకు అదృష్టం కలిసిరాదు. ఎందుకంటే వృషభం అంటే ఎద్దు. సంవత్సరమంతా విపరీతంగా కష్టపడుతుంది. కానీ ఏడాదికొకసారి మాత్రమే అంటే ఏ సంక్రాంతికో రెస్ట్ ఇస్తారు. మంచిగా ఫుడ్ పెడతారు. అలానే వృషభరాశి వాళ్లకు జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉండే ఉంటాయి కానీ కొన్నిసార్లు టైమ్ వస్తుంది. అలా ఈ ఏడాది వీళ్లకు కలిసి వస్తుంది. ఇక ఈ ఉగాది నుంచి వృషభరాశి వారు.. శక్తిని సంగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే 1వ తేదీ శాలరీ వస్తే.. 5వ తేదీకి ఆ డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఆ జాబ్ మానేయండి. వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకోండి. ఎందుకంటే ఈ ఏడాది మీకు బాగా కలిసొస్తుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని కచ్చితంగా అనుగ్రహిస్తుంది. కానీ ఏ రూపంలో వస్తుందో మీరే పసిగట్టాల్సి ఉంటుంది.
వృషభరాశి విద్యార్థులు అయితే విద్యాలక్ష్మి రూపంలో అదృష్టం వస్తుంది. రైతులకు అయితే ధాన్యలక్ష్మి రూపంలో అనుగ్రహిస్తుంది. వ్యాపారస్తులకు అయితే ధనలక్ష్మి రూపంలో అనుగ్రహిస్తుంది. ఏదైనా గొప్ప వ్యాపారం చేస్తుంటే గజలక్ష్మి రూపంలో మీకు అదృష్టం వరిస్తుంది. కాబట్టి చాలీచాలని జీతంతో పనిచేస్తుంటే వెంటనే ఆ ఉద్యోగం మానేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీది. ఏదైనా నగరానికి వెళ్లండి. మీ భాగ్యం ఎంతుందో పరిశీలించుకోండి. ఏదైనా మెట్రోపాలిటన్ సిటీకి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 25-35 ఏళ్ల మధ్య ఉండేవాళ్లు కచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ శ్రీవారు (భర్త) వృషభరాశి వారైతే వాళ్లకు అనుకూలించండి. ఏం పర్లేదు వెళ్లండి అని ధైర్యం చెప్పండి అని ఆస్ట్రాలజర్ డాక్టర్ ప్రదీప్ జోషి చెప్పుకొచ్చారు. మరి మీలో వృషభరాశి వాళ్లు ఎంతమంది ఉన్నారు. పైనంతా చదివిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.