మీరు SBI ఖాతాదారులా? అయితే ఎగిరిగంతేసే వార్త మీ కోసమే

Sbi Bank Sbi India

మీరు SBI ఖాతాదారులా? వరుస ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? దీంతో పర్సనల్ లోన్ తీసుకోవాలనుందా? అయితే ఎగిరిగంతేసే వార్త మీ కోసమే అందించింది SBI. దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థగా అవతరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త అవకాశాన్ని కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా అనేక మంది ఖాతాదారులున్న SBI ఎప్పటికప్పుడు కస్టమర్లతో నడుచుకుంటూ వారికి అనుగుణంగా సేవలు అందిస్తోంది.

అయితే ఇందులో భాగంగా తాజాగా SBI తమ ఖాతాదారులకు ఇన్ స్టంట్ ప్రిఅప్రువ్డ్ పర్సనల్ లోన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం నాలుగు క్లిక్ లతోనే లోన్ లను ఖాతాదారులు పొందే అవకాశం ఉందని తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. వడ్డీ రేట్ల విషయాని కోస్తే 9.6 రేటు నుంచి ప్రారంభమవుతుందని ప్రకటనలో తెలిపింది. ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలంటూ బ్యాంక్ కస్టమర్లకు SBI సూచించింది. అయితే లోన్లు పొందాలనుకునే వారు మీ స్థానిక SBI బ్యాంక్ నందు సంప్రదించాలంటూ తెలిపింది. ఇక తాజా ప్రకటనతో SBI ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.