‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ గెలిచిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అందరూ వెతుకుతున్న ప్రశ్న మాత్రం ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారు? బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు? ఈ ప్రశ్నకు అభిమానులు మాత్రం వారు ఇష్టపడే కంటెస్టెంట్ పేరు చెప్పుకుంటున్నారు. కానీ, ఈ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన ఆట చూసి ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ వచ్చిందంటే సన్నీ.. అవును సన్నీకి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతని ఆటకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. అసలు సన్నీకి ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యారో చూద్దాం.
స్ట్రైట్ ఫార్వడ్..
హౌస్ లో మొదటి వారం నుంచి ఇప్పటి వరకు చూసిన ఆట ప్రకారం సన్నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ.. స్ట్రైట్ ఫార్వాడ్ గా ఉండటం. అతనికి ఏదనిపిస్తే అది చెప్పడం. తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడం. ఆ విషయంలో సన్నీకి ఎంతో మంది ఫాలోవర్స్ అయ్యారు. తప్పు చేసిన దోస్త్ అయినా సరే అది తప్పు అని చెప్పడంలో సన్నీ ముందుంటాడు. 81వ ఎపిసోడ్ లో ఆర్జే కాజల్.. షణ్ముఖ్ తో వాడిన ఒక మాట గురించి సన్నీ ఫైర్ అయ్యాడు. ‘కాజల్ నువ్వు మాట్లాడటం తప్పు. అది కరెక్ట్ కాదు’ అని కాజల్ కు ఫేస్ మీద చెప్పాడు. అదే ప్రేక్షకులకు ఎక్కువ నచ్చింది.
అప్పటి నుంచే ఇంత ఫాలోయింగ్..
ఎప్పుడైతే హౌస్ మొత్తం ఒక్కటై సన్నీకి కత్తులు గుచ్చారో అప్పటి నుంచి సన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. జెన్యూన్ గా ఆడటం అతని తప్పా? అంటూ సోషల్ మీడియాలో సన్నీకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అతను చేసిన ఫన్. ఫ్రెండ్స్ కోసం చేసే త్యాగాలు. ఫ్రెండ్స్ కు అతను సపోర్ట్ చేసే తీరు ఎంతో నచ్చింది. నాగార్జున కూడా సన్నీని ప్రత్యేకంగా మెచ్చుకోవడం చూస్తే అర్థమవుతుంది. అతను ఎంత బాగా ఆడుతున్నాడో. ప్రతి టాస్కులో సన్నీ 100 శాతం ఎఫర్ట్ పెడతాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన జెస్సీ లాంటి వారు ‘నాకు ఎదురుగా సన్నీ ఉంటేనే నేను 100 శాతం ఇవ్వగలను’ అంటూ చెప్పడం చూస్తేనే తెలుస్తుంది సన్నీ స్టామినా.
రెచ్చగొట్టడం..
సన్నీలో ఉన్న ప్రధాన డ్రాబ్యాక్ రెచ్చిపోతాడు. ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేడు. అతనికి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం రాదు. కొంచం ప్రొవేక్ చేస్తే చాలు ఇంక ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. కానీ హద్దులు దాటి మాట్లాడింది లేదు. ఆ చిన్న మైనస్ పాయింట్ ను క్యాచ్ చేసుకుని చాలా సందర్భాల్లో అతడ్ని టార్గెట్ చేశారు. కానీ, ఒక వారం మొత్తం అతను కూల్ గా ఉండగలను చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
బిగ్ బాస్ గేమ్ పరంగా సన్నీకి వచ్చిన ఫాలోయింగ్.. క్రేజ్ చూస్తే అతను టైటిల్ విన్నర్ అవుతాడు అనడంలో సందేహం లేదు. కానీ, అది అంత ఈజీ మాత్రం కాదు. ప్రస్తుతం పరిస్థితుల్లో సన్నీ టైటిల్ విన్నర్ అయినా కాకపోయినా.. ప్రేక్షకుల దృష్టిలో మాత్రం సన్నీనే టైటిల్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నాం. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారని మీరు బావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.