ఈసారి నామినేషన్స్‌లోకి షణ్ముఖ్‌.. ఈ వారం నామినేషన్స్‌ లో ఉన్నది వీళ్లే!

BB5 telugu

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేషన్‌తో హౌస్‌ మొత్తం ఎమోషనల్‌ అయ్యింది. ‘సింహంతో వేట.. నాతో ఆట చాలా డేంజర్‌’ అంటూ మాస్టర్‌ చెప్పిన డైలాగులతో ఒకింత విసిగిపోయే ఓట్లు వేయలేదు అని బయట బాగా టాక్‌ కూడా వచ్చింది. ఎట్టకేలకు గుంటనక్క ఎవరో చెప్పేసిన మాస్టర్‌.. విశ్వను కూడా బాగానే టార్గెట్‌ చేసినట్లు కనిపించింది. బిగ్‌ బాస్‌ బజ్‌లో విశ్వ ఫొటోను కాలితో తన్నడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా భార్యకు నా అవసరం ఉందేమో.. అందుకే దేవుడు నన్ను పంపిస్తున్నాడు అనుకుని మాస్టర్‌ బిగ్‌ బాస్‌ నుంచి బయటికొచ్చేశారు.

బిగ్‌ బాస్‌ హౌస్‌లో ‘మన్‌ డే అంటే ఫన్‌ డే’ నామినేషన్స్‌ రాగానే అందరూ అసలు రంగులు బయటకు తీస్తారు. అప్పటి వరకు చెట్టాపట్టాలేసుకు తిరిగిన హౌస్‌ మేట్స్‌ ఈ వారం మొత్తం మనసులో దాచుకున్న ఫీలింగ్స్‌ను బయటకు తీసి నామినేట్‌ చేస్తారు. అప్పుడే అసలు వారి మధ్య ఉన్న బంధం, రిలేషన్‌షిప్‌ ఏంటో ప్రేక్షకులకు తెలుస్తుంది. బిగ్‌ బాస్‌ హౌస్‌లో నామినేషన్‌కు సిల్లీ రీజన్స్‌ చెప్తున్నారు అంటూ ఆరోపణలు ఉంటాయి. ప్రతిసారి సరిగ్గా నడవలేదు.. నాతో మాట్లాడలేదు. ఎందుకో నువ్వు ఇంకా అందరితో కలవట్లేదు అందుకే నామినేట్‌ చేస్తున్నా.. ఇక నుంచైనా కలువు అంటారు. ఇవి చూసే ప్రేక్షకుడికి కూడా సిల్లీగా అనిపించవచ్చు. కానీ, కారణం ఏదైనా ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్‌ చేయక తప్పదు.

biggboss nominations listఈసారి నామినేషన్స్‌లో సీజన్‌లోనే అత్యధికంగా తొమ్మిది మంది ఉన్నారు. అంటే హౌస్‌లో రచ్చ బాగానే నడుస్తోంది. ఈ వారం నామినేషన్స్‌లో షణ్ముఖ్‌, సన్నీ, జెస్సీ, రవి, మానస్‌, విశ్వ, లోబో, హమీదా, ప్రియ ఉన్నారు. షణ్ముఖ్‌ ఈసారి నామినేషన్స్‌లోకి రాగానే అతని అభిమానులు ఓట్లేసయాడినికి రెడీ అయిపోతున్నారు. దాదాపు రెండు వారాల తర్వాత జెస్సీ మళ్లీ నామినేషన్స్‌లోకి వచ్చాడు. చూడాలి ఎవరు ఈ వారం హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతారో. ‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, గాసిప్స్, ఎలిమినేషన్స్‌ కోసం సుమన్‌ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.

ఈ వారం హౌస్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.