‘బిగ్ బాస్ 5 తెలుగు’తో స్టార్ మాకు దేశంలోనే అత్యధిక జీఆర్పీ నమోదైంది. అంతే జోష్‌తో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది బిగ్ బాస్. టాస్కులు, కయ్యాలు, కన్నీటి ఎపిసోడ్లతో ప్రేక్షకులను టీవీలకి కట్టిపడేస్తున్నాడు బిగ్ బాస్. హౌస్‌లో ఎప్పుడూ వారానికి ఒక కెప్టెన్, రేషన్ మేనేజర్లు ఉంటారు. అది రెగ్యులర్‌గా జరిగే ప్రోసెస్. ఈ క్రమంలోనే హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్‌గా సిరి హన్మంతు నిలిచింది. ఆమె తర్వాత విశ్వ రెండో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. మరి వారం గడిచిందంటే కొత్త కెప్టెన్ కావాలిగా మరి. అందుకే బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వారిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంచుకుంటారు.
అలా పెళ్లి చూపుల టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. శ్రీరామచంద్రను అమెరికా రిటర్న్ అబ్బాయిగా చూపించాడు. అందులో మంచి ప్రదర్శన చేసిన శ్రీరామచంద్ర కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికయ్యాడు. అందుకు సంబంధించిన టాస్కులోనూ హౌస్‌మేట్స్ మద్దతు పొంది శ్రీరామ్ ‘బిగ్ బాస్ 5 తెలుగు’ మూడో కెప్టెన్‌గా అవతరించాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇప్పటివరకు ఉన్న కెప్టెన్లు సిరి, విశ్వాల తర్వాత వచ్చే సింగర్ శ్రీరామ్ ఎలా హౌస్‌ని రన్ చేస్తాడనే ఉత్కంఠ ప్రేక్షకుల్లోనూ ఉంది. సిరి కెప్టెన్‌గా అంత ప్రభావం చూపలేకపోయిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు విశ్వ మాత్రం ఎక్కువ డిసిప్లైన్‌తో ఇంటి సభ్యులను ఇబ్బంది పెట్టాడని లోపలి సభ్యులే పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. ఇంక మన సింగర్ శ్రీరామ్ ఎలా వ్యవహరిస్తాడో చూడాల్సిందే. అటు సింగర్ కూల్‌గా ఉంటాడు అనుకుంటే.. టాస్కుల విషయంలో టెంపర్‌ని కూడా ప్రదర్శించాడు.
సింగర్ శ్రీరామ్ కెప్టెన్ కూల్ అవుతాడా? హౌస్ మొత్తాన్ని ఆర్డర్‌లో పెడతాడా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి.