బిగ్‌బాస్‌ ఇంట్లో ప్రియాంక సింగ్‌కు జీవితంలో మర్చిపోలేని సర్‌ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టిస్తున్న పింకీ

priyanka singn biggboss

ఇప్పటివరకు ఎంతో సరదాగా సాగిపోతున్న ‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ ఇంట్లో అందరి కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. జబర్దస్త్‌ సాయితేజ అలియాస్‌ ప్రియాంక సింగ్‌కు పుట్టినరోజు సందర్భంగా జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. తను సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన విషయం ఇప్పటివరకు తన తండ్రికి తెలీదు. అదే విషయాన్ని బిగ్‌ బాస్‌ ఇంట్లో చెప్పుకుని ఎంతో బాధపడింది. ఇప్పుడు బిగ్‌బాస్‌ వాళ్లు చేసిన పనికి అందరూ అభినందిస్తున్నారు. తాను చెప్పుకోలేక బాధపడుతున్న విషయాన్ని పింకీ వాళ్ల తండ్రికి చేరవేసి తనను తానుగా తన తండ్రికి దగ్గరయ్యేలా చేశారు. ప్రియాంక సింగ్‌ను యాక్సెప్ట్‌ చేస్తున్న విషయాన్ని తన తండ్రే స్వయంగా చెప్పిన వీడియోని బిగ్‌ బాస్‌ హౌస్‌లో ప్లే చేశారు.

priyanka singh‘పిల్లలు అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా.. పిల్లలు కాకుండా పోతారా?’ అంటూ ప్రియాంక సింగ్‌ వాళ్ల తండ్రి చెప్పిన మాటలకు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియో చూసిన మొత్తం హౌస్‌ మేట్స్‌ ఆనందంతో గంతులేశారు. తన పుట్టింటి వచ్చిన చీర, గాజులు, పూలను చక్కగా అలంకరించుకుంది ప్రియాంక సింగ్‌. గొడవలు, కొట్లాటలతో హాట్‌ హాట్‌గా ఉన్న ఇంటి వాతావరణం ఒక్కసారిగా ఎమోషనల్‌గా మారిపోయింది. బిగ్‌ బాస్‌ హౌస్‌ వల్ల ఎంత రెమ్యూనరేషన్‌ వస్తుందో తెలీదు గానీ, ప్రియాంకకు మాత్రం తన కుటుంబం దొరికింది. సమాజంలో తల్లిదండ్రుల ద్వారా వెలివేయబడి దిక్కూమొక్కూ లేకుండా అనాథలుగా జీవితాలు వెళ్లదీస్తున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారు ఇప్పటికైనా ప్రియాంక సింగ్‌ కుటుంబాన్ని చూసి మారాలని కోరుకుందాం. సమాజంలో అలాంటి వారి పరిస్థితి మారాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.priyanka