కెప్టెన్సీ కోసం కుమ్ములాట.. నేనంటే నేనంటూ ఇంటి సభ్యుల గలాటా!

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ సూపర్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ప్రతి టాస్కు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో కంటెస్టుంట్లు పేరున్న వారు ఎక్కువ మంది లేకపోయినా.. ఆటను తెలివిగా ఆడుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. బిగ్‌ బాస్‌ కూడా అద్భుతమైన టాస్కులతో అందరినీ అలరిస్తున్నాడు. ఇంటి సభ్యులు ఫిజికల్‌ టాస్కులతో పాటు మైండ్‌ గేమ్స్‌ కూడా గట్టిగానే ఆడుతున్నారు. తాజాగా బిగ్‌ బాస్‌ ఇచ్చిన టాస్కులో సభ్యులు బాగా ఇన్వాల్స్‌ అయ్యి ఆడుతున్నారు. ఎందుకంటే అందులో గెలిచిన వారే కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికవుతారు.

‘నెగ్గాలంటే తగ్గాల్సిందే’ అనే టాస్కులో జంటలుగా విడిపోయి సభ్యులు పోటీపడుతున్నారు. ఈ టాస్కు కోసం ఇంటి సభ్యులు ఎన్నో కష్టాలు పడ్డారు. తగ్గడం కోసం తిండిని కూడా కాదని ఓపిగ్గా వెయిట్‌ చేశారు. బరువు తగ్గేందుకు వాళ్లు పడిన కష్టాలు అందరినీ ఆలోచింపజేశాయి. ఇంట్లోని సభ్యులు కూడా అర్థం చేసుకున్నారు.. తినే తిండిని ఎంతో మంది వృథా చేస్తున్నారు. అసలు తింటానికి లేని వాళ్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న వాళ్ల మదిని తొలిచేసింది. అందరి కన్నా లోబో ఎంతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. తగ్గడం కోసం తన టీమ్మేట్‌ నటరాజ్‌ మాస్టర్‌ను గెలిపించడం కోసం బాగా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ టాస్కు అయిపోయింది. కానీ, ఇప్పుడు వారిలో ఇంకో ప్రశ్న మొదలైంది. కెప్టెన్సీ పోటీదారు అయ్యేందుకు ఎవరు వెళ్లాలి అని.

biggboss promoనువ్వా.. నేనా?

టాస్కు పూర్తైన తర్వాత ఎవరైతే తక్కువ బరువు ఉంటారో వారి ప్రదర్శనను బట్టిన నాలుగు జంటలను ఎన్నుకుని వారిలో ఒక్కొక్కరు చొప్పున కెప్టెన్సీ పోటీదారుగా ఎంపికవుతారు. కెప్టెన్‌ అయిన వారికి ఇంట్లో ఇమ్యూనిటీ లభిస్తుంది. అంటే వారు ఆ వారం నామినేషన్స్‌లోకి వెళ్లరు అందుకే అందరూ అందుకోసం ఎదురుచూస్తుంటారు. ఇద్దరిలో ఒకరు అనగానే అందరూ తామంటే తామంటూ పోటీ పడుతున్నారు. కొందరు మాటల్తో తేల్చుకోవాలని చూస్తున్నారు. కొందరు నువ్వు అప్పుడు చేశావ్‌గా అంటూ లెక్కలు చెప్తున్నారు. మానస్‌ అయితే శ్రీరామ్‌ వెళ్తే నేను వెళ్లాల్సిందే అంటూ పట్టుబడుతున్నాడు. యానీ, శ్వేత అయితే కుషన్‌తో టాస్‌లు వేసుకుంటున్నారు. ఈ విధంగా కొందరు ఫన్నీగా కొందరు సీరియస్‌గా పోటీపడుతున్నారు.

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, గాసిప్స్‌, ఎలిమినేషన్స్‌ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్‌ టీవీ తెలుగు వెబ్‌సైట్‌ని చూస్తుండండి.