బిగ్ బాస్ 6వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన పర్సన్ గీతూ రాయల్. గలగలా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరితోనూ గొడవలు పెట్టుకుంటోంది. హౌసులో అడుగుపెట్టిన దగ్గర నుంచే తన మార్క్ చూపిస్తూ రెచ్చిపోతోంది. పక్కా స్ట్రాటజీతో గేమ్ ఎలా ఆడితే బిగ్ బాస్ ని మెప్పించొచ్చో ఆమె అర్ధమైనంతగా మరెవరకి అర్ధం కాలేదనుకుంటా! అలా ఆటపై ఫుల్ కాన్సంట్రేషన్ చేసిన గీతూ.. హౌసులోని తోటీ కంటెస్టెంట్ కి ఫిదా అయిపోయింది! ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పడం విశేషం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా ‘అడవిలో ఆట’ గేమ్ ని తాజాగా నిర్వహించారు. ఇందులో కొందరు పోలీసులుగా, కొందరు దొంగలుగా విడిపోయారు. గీతూ.. స్వార్థపరురాలైనా వ్యాపారిగా కనిపించింది. ఇక గేమ్ విషయానికొస్తే.. ఎర్ర ట్యాగ్ ఉన్న బొమ్మల్ని దొంగలు, గీతూకి అమ్మాలి. అలా కొనుకున్న బొమ్మల్ని, ఆమె రక్షించుకోవాలి కూడా. ఈ క్రమంలోనే ఉదయం లేచిన గీతూ.. బాత్రూమ్ కి వెళ్లాలి. ఒకవేళ బొమ్మలు వదిలేసి వెళ్తే.. మళ్లీ వాటిని ఎవరైనా దొంగిలించొచ్చు.అలాంటి టైములో ఆర్జే సూర్య, గీతూ దగ్గరికి వచ్చాడు. ఈ క్రమంలోనే తాను బొమ్మల్ని చూసుకుంటానని చెప్పాడు. తొలుత నమ్మాలా వద్దా అని సంశయించిన గీతూ.. ఆర్జే సూర్యకి వాటిని అప్పజెప్పింది.
తన ప్రాణాలు పణంగా పెట్టయినా సరే వీటిని కాపాడుతానని సూర్య చెప్పడంతో.. గీతూ బాత్రూంకి వెళ్లి వచ్చింది. తర్వాత ఆర్జే సూర్య.. తన మాట నిలబెట్టుకోవడం చూసి రిలాక్స్ అయింది. ఇక బొమ్మలతో సంబంధం లేకుండా సూర్యకి చాలా డబ్బులిచ్చింది. గెలిచే విషయంలోనూ చాలా సపోర్ట్ చేసింది. కానీ బ్యాడ్ లక్, ఏం చేస్తాం. పోలీసుల టీమ్ గెలవడంతో సూర్యకి… కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ టాస్క్ పూర్తయిన తర్వాత సూర్య గురించి గీతూ, ఆదిరెడ్డితో మాట్లాడింది. ఆ ఒక్క విషయంలో సూర్యకి పడిపోయానని చెప్పింది. ఇదంతా గమనిస్తున్న నెటిజన్స్.. గీతూలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. మరి గీతూ, సూర్యకి ఫిదా కావడంపై మీరేం అనుకుంటున్నారు.మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్‌లో రెచ్చిపోయిన ఉడాల్ మామ.. మూడోవారం కెప్టెన్‌గా..!