లోబోతో పీకల్లోతు ప్రేమలో ఉమాదేవి.. బయటికొచ్చినా ఇంకా పోలేదంట..

lobo umadevi

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ అనగానే అక్కడ ఏమీ లేకపోయినా ఏదో చూపిస్తారనే ఫీలింగ్‌ అందరిలో ఉంది. అక్కడ నడిపించే.. కనిపించే హగ్గులు, లవ్వులు అన్నీ అక్కడి వరకే అని అందరికీ తెలుసు. కాస్త మసాలా యాడ్‌ చేయలనే తాపత్రంలో కలిపే పులిహోరే తప్ప బయట ఏమీ ఉండదని అందరికీ తెలుసు. గత సీజన్‌ లలో చూశాం కూడా.  ఇప్పుడు అలా కలిపిన ఒక జంట బయట కూడా తమ బంధాని వదులుకోలేక తెగ తపన పడిపోతున్నారు. ఇప్పటికే అర్థమైపోయుండాలి. అదే ఉమాదేవి- లోబో జంట అనమాట

తప్పేంటి?..

ఉమాదేవి రెండోవారమే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ గ్యాప్‌ లోనే వీరి మధ్య బాత్‌ రూమ్‌ లో ప్రేమ చిగురించి.. ఇప్పుడు బయట టీవీ షోలలో పరిమళిస్తోంది. 8వ వారంలోనే లోబో ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చాడు. ఇప్పుడు టీవీ షోలలో బాగా బిజీగా ఉన్నారు. అక్కడ కూడా పొట్టీ- బంగు అంటూ చెట్టాపట్టాలు వేసుకుని గడిపేస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నారు ఇదేంటని ప్రశ్నిస్తే.. అందుకు ఉమాదేవి బోల్డ్‌ గా ఆన్సర్‌ చేస్తోంది. ‘వయసులో ఉన్న వారికే ప్రేమ పుట్టాలి అంటే ఎలా? ప్రేమ ఏ వయులోనైనా పుట్టచ్చు. పిల్లలే ప్రేమించుకోవాలనేది కరెక్ట్‌ కాదు. నేనైతే నా బంగును మిస్‌ అవుతున్నా’ అంటూ ఉమాదేవి తన ఫీలింగ్స్‌ ను చెప్పేసింది. మరి ఇదంతా నిజమా? లేక బయట టీవీ షోల కోసం ఇలా కంటిన్యూ చేస్తున్నారా? అనేది మాత్రం వాళ్లకే తెలియాలి. ఉమాదేవి- లోబో రిలేషన్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Uma Devi Appala (@umadevi.appala)