బయటకొచ్చినా.. తగ్గేది లేదంటున్న 7 ఆర్ట్స్‌ సరయు

biggboss buzz

సరయు అలియాస్‌ ‘7 ఆర్ట్స్‌ సరయు’.. ఈ పేరు వినగానే ఒక ఎనర్జీ, ఒక జోష్‌ గుర్తొస్తది. ఆమెకు యూట్యూబ్‌ అర్జున్‌ రెడ్డి అని కూడా పేరుంది. అలాంటి ఆమె బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వస్తోందింటే అందరూ టాప్‌ 5 కంటెస్టెంట్‌ వచ్చింది అనుకున్నారు. ఇక, బిగ్‌ బాస్‌ హౌస్‌ మొత్తం రచ్చ రంబోలా కాబోతోందని ఊహించుకున్నారు. కానీ, సీన్‌ రివర్స్‌ అయ్యింది. మొదటివారమే ఎలిమినేట్‌ అయ్యింది. ఇంటి నుంచి బయటికొచ్చేసింది. బిగ్‌ బాస్‌ 5 తెలుగులో సరయుకి అన్యాయం జరిగింది అంటూ సోషల్‌ మీడియాలో అసహనాలు, నిరసనలు ప్రారరంభమయ్యాయి కూడా. హౌస్‌లో ఉన్నప్పుడు స్క్రీన్‌ స్పేస్‌ దొరకని సరయుకి.. తన గురించి తన గేమ్‌ గురించి చెప్పేందుకు ‘బిగ్‌ బాస్‌ బజ్‌’ స్టేజ్‌లో అవకాశం దొరికింది. ఒక్కడ్ని కూడా వదలకుండా ధంధం చేసింది.

biggboss buzzసరయు హౌస్‌లో ఉన్నప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా కూడా తనకు సరైన అవకాశం ఇవ్వలేదు. సరైన స్క్రీన్‌ స్పేస్‌ ఇవ్వలేదని బిగ్‌ బాస్‌పై అందరూ గుర్రుగా ఉన్నారు. సరయు ఎవరితో సెట్‌ కాలేదని ‘సెట్‌- కట్‌’ కార్యక్రమం చూడగానే అందరికీ అర్థమైపోయింది. సరయు ఎక్కువగా మాట్లాడింది సిరి హన్మంత్‌, షణ్ముఖ్‌ జశ్వంత్‌ గురించే. వారు అనుకోని గేమ్‌ ఆడుతున్నారు. ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకుంటున్నారు. షణ్ముఖ్‌ని అడ్డుపెట్టుకుని సిరి గేమ్‌ ఆడుతోందంటూ సరయు చెప్పింది. అలా ఇలా కాదు ఒక రేంజ్‌లో ఇచ్చిపడేసింది. షణ్ముఖ్‌కి ఓపెన్‌ సవాలు చేసింది. దమ్ము, ధైర్యం ఉంటే మనిద్దంరం ఆడదామంటూ. అసలు సిరికి, సరయుకి చెడపోడానికి డైరెక్ట్‌ కారణం ఏమీ లేదు. ఆమె మాటలను బట్టి చూస్తే మొత్తం బయట గొడవలు ఏవో ఇక్కడిదాకా వచ్చాయని తెలుస్తోంది. షణ్ముఖ్‌ని ముందు నీ ఆట ఆడుకో ఆ తర్వాత ఆమెని లెపుదువు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. సరయు కామెంట్స్‌ సిరి, షణ్ముఖ్‌ మున్ముందు ఆటపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.

biggboss buzzవిశ్వ అంటే ఎందుకు అంత అభిమానం ఏర్పడింది. సరయు హౌస్‌లో ఉన్నంతకాలం విశ్వతోనే కాస్త ఓపెన్‌గా మాట్లాడింది. సరయు హౌస్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు విశ్వతో ఉన్న బాండింగ్‌ ఏంటో అందరికి అర్థమైంది. హౌస్‌లో బీప్‌..బీప్‌.. ధమ్మున్న మగాడు విశ్వ ఒక్కడే అన్న సరయు కామెంట్స్‌ని ప్రేక్షకులు కచ్చితంగా లైట్‌ తీసుకోరు. యాంకర్‌ రవిని కూడా చాలా సింపుల్‌గా సైడ్‌ చేసింది సరయు. నీతి సూక్తులు చెప్పడం తప్ప ఏం చేయడు అన్న మాటలు విని రీకాల్‌ చేసుకుంటే. రవి పంచాయితీలు చేయడం, లోబోని కామెంట్‌ చేయడం తప్ప పెద్దగా పార్టిసిపేషన్‌ ఏం కనిపించడం లేదు.

biggboss buzzవీజే సన్నీ.. చాలా కూల్‌గా అందరితో కలిసిపోతూ కనిపిస్తున్నాడు. కానీ, సరయు ఎందుకు అంత రచ్చ చేసింది. ఆమె మాటలు చూస్తుంటే సన్నీ మొఖానికి మాస్క్‌ వేసుకున్నాడా? అన్న ప్రశ్న బాగా వినిపిస్తోంది. వారి వైరం బయట నుంచే కొనసాగుతోందని సరయు చెప్తున్నా.. సన్నీ ఆ మాటలను కొట్టిపారేస్తున్నాడు. అదే నిజమైతే సన్నీ మాస్క్‌ వేసుకుని గేమ్‌ ఆడుతున్నాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. లహరి షేరీ గురించి చాలా మంది ప్రేక్షకులు అసంతృప్తితోనే ఉన్నారు. ఆమె బాగా గొడవలు పడుతోందని.. అరిచేస్తోందిని అదే విషయాన్ని సరయు కూడా ప్రస్తావించింది. ఈ షో మొత్తంలో అందరికీ నచ్చిన ఒక్క విషయం ఏంటంటే సరయు ఆ ఫొటోలను విరగకొట్టడం. చేతుల్తో ఫొటోలను, మాటలతో హౌస్‌ మేట్స్‌ని ఇరగ్గొట్టేసిందని బయట టాకు.

ఏది ఏమైనా అనుకోకుండా బయటకు వచ్చేసిన సరయు తిరిగి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తే చూడాలని ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. అదే గనుక నిజమైతే ఈసారి నిజంగానే బిగ్‌బాస్‌ 5 తెలుగు షో మొత్తం ధంధం అయిపోతుంది.