కొన్నిసార్లు మనుషులు చేసే చిన్న తప్పులు మర్చిపోలేని శిక్షకు దారి తీస్తాయి. జీవితంలో గొప్ప గుణపాఠాన్ని కూడా నేర్పిస్తాయి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. నోరు, చెయ్యి కూడా జర భద్రంగా ఉంచుకోవాలి. అవతల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులోనూ పోలీసులు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను అరే, తురే అంటేనే వీపు విమానం మోత మోగుతుందని తెలుసు.
అదే చేయి చేసుకుంటే.. డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ కాలర్ పట్టుకుంటే ఇంకెలా ఉంటుంది? మీ ఇమాజినేషన్ కరెక్టే మరి. ఇటీవల ఢిల్లీలో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీస్‌పై చేయి చేసుకుని చివరికి కన్నీళ్లు పెట్టుకుంటూ చేసిన వీడియో గుర్తుంది కదా. అందరూ అదే ఇమాజిన్ చేసుకుంటున్నారంట. ఈ సందర్భం ఎక్కడ జరిగిందని తెలీదు కానీ, బండి ఆపిన కానిస్టేబుల్‌పై.. ఓ యువకుడు నేనెవరో తెలుసుకోకుండా ఇలా చేస్తున్నారంటూ రెచ్చిపోవడం అయితే కనిపిస్తోంది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని అతనిపై దాడి చేసినంత పని చేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. యువకుడి ప్రవర్తనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.