డాన్స్‌ చేస్తూ యువకుడు మృతి వీడియో వైరల్‌!

youth died while dance at mandapam

ఊరు, వాడ, వీధి అన్నిచోట్ల వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చాలా ఘనంగా అందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపట్లో వినాయకచవితి అనగానే అందరికీ డీజేలు, తీన్‌మార్‌లు కామన్‌ అయిపోయింది. అలాగే అప్పటివరకు హుషారుగా స్టెప్పులేసిన ఓ కుర్రాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇదంతా అనంతపురం జిల్లా గుత్తిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గౌతమిపుర కాలనీలో వినాయకుడి మండపం వద్ద కుల్లయ్య అనే యువకుడు డాన్స్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఉప్పెన సినిమాలోని పాటకు నృత్యం చేస్తూ.. నన్ను తీరానికి లాగే దారం దారం అంటూ ఆ కుర్రాడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతను ఎందుకు మరణించాడో తెలియరాలేదు. స్థానికులు డాన్స్‌ చేసి ఆయాసం రావడమో.. గుండెపోటుతోనే మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ వీడియో చూసిన అందరూ భక్తిశ్రద్ధలతో పండుగల చేయండి. సరదాలుక పోయి ప్రాణాలమీదకు తెచ్చుకోకండి అంటూ సూచిస్తున్నారు.