అంతస్తులు- అంతరాలు మరిచిన స్నేహం.. వీడియో వైరల్‌

friendship

తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, అన్నదమ్ములు ఇలాంటి బంధాలను మినహాయిస్తే.. ‘స్నేహం’ అనే బంధం వెలకట్టలేనిది. కష్టాల్లో తోడుండేవాడు, బాధలో ఓదార్చేవాడు, ఒడిదుడుకుల్లో వెంటనడిచేవాడు, నీ విజయం చూసి ఆనందించేవాడు, ఓటమిలో వెన్నుతట్టే ఒక్క మిత్రుడుని సంపాదించుకో చాలు అంటారు. అది ముమ్మాటికీ నిజం. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్క మంచి మిత్రుడు ఉంటే చాలు.

ఇదీ చదవండి: ప్రియాంక సింగ్‌ పై సోషల్‌ మీడియా వేదికగా మానస్‌ ఫ్యాన్స్‌ ఫైర్..

ప్రేమ, పెళ్లి వంటి బంధాలు మాదిరిగానే రానురాను స్నేహానికి కూడా ఆస్తులు, అంతరాలు అడ్డు వస్తున్నాయన్నది కొందరి భావన. ప్రేమించడమే కాదు.. ఫ్రెండ్‌ షిప్‌ చేయాలన్న తాహతల గురించి ప్రస్తావన వస్తోందనేది కొందరి వాదన. అయితే అలాంటి వాటికి చెక్‌ పెడుతూ ఒక ఎగ్జిబిషన్‌ లో కనిపించిన ఈ దృశ్యం అందరి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది. ఎగ్జిబిషన్‌ లో బుడగలు అమ్ముకునే మహిళ తన చిన్నారిని తీసుకుని వచ్చింది. అక్కడికి ఎగ్జిబిషన్‌ చూసేందుకు వచ్చిన మరో చిన్నారి బుడగలు అమ్ముకునే మహిళ బిడ్డ వద్దకు వచ్చి ఆడుకునేందుకు చూసింది. కల్మషంలేని నవ్వుతో ఆ చిన్నారిని పలకరించింది, ఆడుకుంది. బుడగలు అమ్ముకనే మహిళ చిన్నారి వెళ్లి ఆ ధనిక బిడ్డను ఆప్యాయంగా హత్తుకోగా.. తిరిగి ఆ చిన్నారిని హత్తుకుని స్నేహమంటే ఇదేరా అంటూ చాటారు. ఆ చిన్నారుల దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. స్నేహానికి డబ్బు, హోదాతో సంబంధం లేదు? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.