వైరస్ కి విరుగుడు అంటూ పాముని తినేశాడు!

కరోనా సృష్టిస్తున్న చిత్రాలు, విచిత్రాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు దేశంలో ఎక్కడ, ఏమి జరిగినా.. దానికి కరోనాతో లింక్ ఉంటూనే ఉంది. ఇక ఈ మహమ్మారి విషయంలో కొంత మంది తెలియక చేస్తున్న పొరపాట్లు ఒక్కోసారి యావత్ దేశానికే షాక్ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో మందుబాబులు చేసే రచ్చ మాములుగా ఉండటం లేదు. పోయిన ఏడాది కరోనా వచ్చిన కొత్తల్లో… కరోనాకి వేడి ఉండాలి. అందుకే మందు తాగుతున్నా అంటూ ఓ డ్రింకర్ చేసిన కామెంట్స్ ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ విచిత్ర సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు ఒక వ్యవసాయ కూలీ. యాభై ఏళ్ల వయసున్న వడివేలు ఈమధ్య ఒకరోజు కట్లపామును చేతబట్టి డాన్సులేశాడు. అప్పటికే ఆ పాము చనిపోయి ఉండటంతో ఎవ్వరూ అతన్నిఆపే ప్రయత్నం చేయలేదు. పైగా.., వడివేలు అప్పటికే పూర్తిగా మద్యం సేవించి ఉన్నాడు. దీంతో.., తాగిన మత్తులో ఊగుతున్నాడులే.., కాసేపు అయ్యాక అతనే ఇంటికి వెళ్ళిపోతాడని అంతా అనుకున్నారు. కానీ.., వడివేలు ఆ మత్తులో సడెన్ గా కరోనా గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు.

pamu 2ఈ వైరస్ వస్తుందని మీరంతా భయపడుతున్నారు కదా? కానీ.., నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఈ పాము కరోనాకి విరుగుడు. దీన్ని తింటే కరోనా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ.., అందరూ చూస్తుండగానే దానిని నమిలి తినేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో..,ఈ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఫారెస్ట్ అధికారులకి కూడా ఆ వీడియో చేరింది. దీంతో.., వీరు చివరికి వడివేలుని గుర్తించి.., అరెస్ట్ చేశారు. ఆ టైంలో అతను ఫుల్గా తాగి ఉన్నాడని, అదృష్టవశాత్తూ అతను విష గ్రంథిని కొరకలేదని అధికారులు వెల్లడించారు. కట్లపాము విషంలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయని, అవి పక్షవాతాన్ని కలగజేస్తుందని ఫారెస్ట్ అధికారులు తెలియచేశారు. ఇక మత్తు దిగాక.., వడివేలు ఈ ఘటనపై నోరు విప్పాడు. అప్పుడు అసలు ఏమి జరిగిందో కూడా నాకు తెలియదు. ఆ పాముని నేను చంపలేదు. చచ్చి పడిపోయి ఉన్న పాముని మాత్రమే నేను తీసుకున్నాను. అక్కడే ఉన్నవారు కొందరు బలవంతం చేయించి నాతో ఆ పని చేయించారని వడివేలు వాపోయాడు. కానీ.., న్యాయస్థానం మాత్రం వడివేలు వాదనని పరిగణంలోకి తీసుకోలేదు. అతనికి రూ.7,000 ఫైన్ విధించింది. చూశారు కదా..? ఏది పడితే అది కరోనా విరుగుడని ఆటలు ఆడితే.., దాని పరిణామం ఇలానే ఉంటుంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.