తాచుపాముతో ఆటలు! ఈ యువతి ధైర్యానికి సెల్యూట్ చేస్తారు!

మాములుగా మనలో చాలా మందికి పాము అంటే భయం. ఇక 9 అడుగులు ఉండే తాచు పాముని చూస్తే పరుగులు తీయడం ఖాయం. ఇక మహిళల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే బొద్ధింకలు, బల్లులుకే వారు ప్రాణం పోయినట్టు అరుస్తారు. ఇక తాచుపాముని చూస్తే అంతే సంగతులు. కానీ.., ఓ యువతి మాత్రం తాచుపాముని చేతితో పట్టుకుని ఆడించింది. ఏ మాత్రం భయం లేకుండా ఆ పాముతో కలసి కెమెరాకి ఫోజులు ఇచ్చింది. ఇంతకీ ఎవరు ఆమె? అంత ధైర్యం ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అయితే.. ఆ వివరాల్లోకి వెళ్ళాల్సిందే. శ్వేత అనే ఓ యువతి తాచు పామును చేతిలో పట్టుకుని కర్రతో దాన్ని ఆడించింది. ఆ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ కాతాలో పోస్ట్ చేసింది. ఎలాంటి భయం లేకుండా ఆమె తాచు పామును చేతిలో పట్టుకుని ఆడిస్తుండడం విశేషం.

snake 2ఈ క్రమంలోనే ఆమె వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. సాధారణంగా యువతులు పాములు అంటే భయపడతారు. కానీ ఎలాంటి జంకు లేకుండా ఆమె పామును ఆడిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శ్వేతకు పాములు అంటే ఇష్టం. ఆ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ఎప్పుడూ పాములతో ఇలా సాహసాలు చేస్తుంటుంది. సాధారణంగా పురుషులే ఎక్కువగా ఇలాంటి సాహసాలు చేస్తారు. స్త్రీలు చేసేందుకు వెనుకడుగు వేస్తారు. కానీ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువగానే రాణిస్తున్నారు. అందుకనే ఆమె కూడా ఈ విధంగా సాహసాలు చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనితో శ్వేతా ధైర్య సాహసాలను అందరూ తెగ మెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి.., అంతటి భయంకరమైన సర్పంతో ఆటలు అంటే మాటల చెప్పండి. శ్వేతా ధైర్యం కనుక మీకు నచ్చితే మీరు కామెంట్స్ రూపంలో ఆమెని అభినందించండి.