\ఈ మధ్యకాలంలో కరోనా ప్రభావం విద్యార్థుల చదువు మీద పడిందనటంలో ఎలాంటి సందేహ లేదు. దీంతో కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్ పూర్తిగా మూసివేశారు. విద్యార్థుల చదువుకి ఆటంకం కలుగుతుందని భావించిన అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి. ఇది విద్యార్థుల పట్ల పెద్దగా ప్రయోజనం చూపించకపోయినా ఏదో పనిగా నెట్టుకొస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి ఆన్ లైన్ క్లాసుల వీడియోలు కొన్ని ఫన్నీ వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ఇలాంటి వీడియో ఒకటి కాస్త వైరల్ గా మారింది. సీఏ ఆన్ లైన్ క్లాసులో CA ధావల్ పురోహిత్ తో పాటు స్టూడెంట్స్ అంతా క్లాస్ వింటున్నారు. ఇంతలోనే ఆ మాస్టారు.. మీరు ఈ రోజు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే..? క్వార్టర్ అంటే ఏంతో తెలుసుకోవాలి అని చెప్పాడు. దీంతో పురోహిత్ హెత్విక్ అనే స్టూడెంట్ ను పిలుస్తూ హెత్విక్ బెటా క్వార్టర్ అంటే ఎంత అని ప్రశ్నించాడు. దీంతో స్పందించిన స్టూడెంట్ హెత్విక్ 30ml సార్ అంటూ సమాధానమిచ్చాడు. ఇక క్లాసు వింటున్న స్టూడెంట్స్ అంతా నవ్వటం మొదలు పెట్టగా టీచర్ ధావల్ పురోహిత్ కోపంతో ఇరిటేషన్ ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. ఇక నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను చూస్తూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/sJpn9I2jQA
— Avdhoot D (@avdhootd007) October 3, 2021