ఒకరి తర్వాత ఒకరితో ప్రేమాయణం.. ఒకే మండపంలో ఇద్దరితో వివాహం.. నువ్వు దేవుడు సామీ!

2marriages

ప్రస్తుతం సమాజంలో పెళ్లి అంటే అదొక బందీఖానా అనే భావనలో యువత కనిపిస్తోంది. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా పెళ్లి అనగానే ఒకడుగు వెనకేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ఏదైనా యువతలో పెళ్లిపై ఆసక్తి తగ్గిందనేది వాస్తవం. కానీ, ఈ యువకుడు మాత్రం అందుకు మినహాయింపు అనే చెప్పాలి. అందరూ ఒకరితోనే వేగలేకపోతున్నాం అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తుంటే ఇతను మాత్రం ఏకంగా ఇద్దరిని పెళ్లాడాడు. అదికూడా ఒకే మండపంలో.. ఒకేసారి వివాహం చేసుకున్నాడు. అంతటి కరేజిస్‌ మ్యాన్‌ గురించి తెలుసుకోవాలని ఉందా? పదండి చూసేద్దాం.

ఆ యువకుడి పేరు సంజీత్‌ ఉరావ్. అతను ఝార్ఖండ్‌ రాష్ట్రం లోహర్దగా జిల్లా హిస్‌రి పంచాయతీకి చెందిన వ్యక్తి అతను. సంజీత్‌.. రింకి ఉరాన్‌ అనే యువతితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం కళావతి అనే యువతితో ప్రేమలో పడ్డాడు మన హీరో. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇంతలో ఈ విషయం రింకి ఉరాన్‌కు తెలిసిపోయింది. ఇద్దరు యువతులు నిన్నే పెళ్లాడతానంటూ పట్టుబట్టారు. ఆ విషయంలో యువకుడు కూడా సరేనన్నాడు. ముగ్గురు వారి కుటుంబాలతో చర్చించుకున్నారు. పెద్దవాళ్లు కూడా అందుకు సరేనన్నారు.

2marriagesఇంకే ముంది పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా సంజీత్‌, రింకి ఉరాన్‌, కళావతిల పెళ్లి జరిగింది. శాస్త్రోక్తంగా ఈ ముగ్గురు ఒక్కటయ్యారు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని ముగ్గురూ అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు వేశారు. ఈ వివాహ చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున చేరుకున్నారు. సంజిత్‌ గురించి తెలుసుకుని వారెవ్వా ఏం కుర్రాడయ్యా బాబూ అంటూ ఒక పక్క పొగుడుతూనే.. ముక్కున వేలేసుకుంటున్నారు. వారి అండర్‌స్టాండింగ్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైన సంజిత్‌ ఉరావ్‌కు తెగువ, గుండెధైర్యం ఎక్కువంటూ ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు వారి పెళ్లి తంతు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: పిచ్చ ఫామ్‌ లో గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌.. అంతా కోహ్లీ పుణ్యమేనా..