వైరల్‌ వీడియో: చిన్నారి కంఠానికి నాగుపాము.. ఊహించని మలుపు

snake

వర్షాకాలం అనగానే విష సర్పాలు, పురుగులు, కీటకాలు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాణాంతకం కూడా కావచ్చు. అలా జరిగిన ఓ ప్రమాదమే ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. మహారాష్ట్ర వార్దాలో ఈ ఘటన జరిగింది. ఏడేళ్ల చిన్నారి నేలపై పడుకొని నిద్రిస్తోంది. చిన్నారి దివ్యానీ గడ్కరీ మెడకు ఓ నాగుపాము చుట్టుకుంది. కదిలిస్తే చిన్నారిని కాటేస్తుందనే భయంతో అందరూ అలాగే ఉండిపోయారు. దాదాపు 2 గంటలపాటు ఆ పాము ఆమె మెడకు చుట్టుకునే ఉంది. చాలాసేపటికి బాలిక కదిలే సరికి కాటేసి వెళ్లిపోయింది. ఆ పామును పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆ చిన్నారిని సేవాగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.