వైరల్‌ వీడియో.. ఫుట్‌బాల్‌ ఆడిన ఎలుగుబంట్లు

Two wild bears were seen playing football Video Viral - Suman TV

ఎలుగుబంట్లు కూృర జంతువులే కావచ్చు, కానీ వాటికి కూడా సరదాగా ఆడుకోవాలని ఉంటుందా? అంటే నిజమే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. రెండు ఎలుగుబంట్లు తమకు దొరికిన ఫుట్‌బాల్‌తో ఆడుకున్నాయి. నోటితో కాళ్లతో దాన్ని తంతూ హుషారుగా గడిపాయి. ఈ ఫన్నీ ఘటన ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఉమర్‌కోట్ ప్రాంతంలోని సుకిగావ్‌లోని అటవీ ప్రాంతంలో జరిగింది. ఆ ఆటను వీడియో తీసిన వాళ్లు దాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది తెగ వైరల్‌ అవుతుంది. ఎలుగుబంట్ల ఫుట్‌బాల్‌ ఆటను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాటికి ఏదైనా కొత్త వస్తువు దొరికితే అవి దాన్ని పరిశీలిస్తాయని, అది వాటి స్వభావం అని అటవీ శాఖ అధికారి తెలిపారు.

Two wild bears were seen playing football Video Viral - Suman TV