ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపే కొందరికి స్టార్ హోదాను కట్టబెడుతుంది. మెగాస్టార్ అంటే టాలీవుడ్ నంబర్ 1 హీరో. సచిన్ అంటే క్రికెట్ దేవుడు. రోజర్ ఫెదరర్ టెన్నిస్ కింగ్. ఇందిరా గాంధీ అంటే.. దేశ రాజకీయాలను కంటిచూపుతో శాసించిన నేత.. ఇలా వీరంతా ఆయా రంగాల్లో గుర్తింపు దక్కించుకున్న విజేతలు. కానీ.. లియోనెల్ మెస్సీ చరిత్ర ఇంతకు మించింది. మెస్సీ అంటే కేవలం ఫుట్‌బాల్‌లో మెరిసిన విజేత మాత్రమే […]
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. తప్పుగా ట్వీట్ చేసి నెటిజెన్ల వలలో చిక్కుకుపోయాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభినందిస్తూ.. యువీ చేసిన ట్వీటే అందుకు కారణం. యువీకి క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ అంటే కూడా ఎక్కువ ఇష్టం. ఈ ఇష్టమే తనను అనుకోని కష్టాల్లోకి నెట్టింది. తాజాగా, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో చేసిన 700వ గోల్ పై స్పందిస్తూ ట్విట్టర్ లో యువీ చేసిన ఓ ట్వీట్ మిస్ ఫైర్ […]
ఆల్ ఇండియా ఫుల్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) మంగళవారం ప్రకటించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల(థర్డ్ పార్టీ) ప్రమేయం ఉన్న కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫిఫా వెల్లడించింది. ఈ సెస్పెన్షన్ వేటు వెంటనే అమల్లోకి వస్తుంది వెల్లడించింది. భారత్‌పై వేటు వేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపింది. తాజా నిర్ణయంతో ముగ్గురు సభ్యుల ఏఐఎఫ్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఏఐఎఫ్ఎఫ్‌పై పాలక మండలి […]
ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన సతీమణి జార్జినాకు అప్పుడే పుట్టిన కవలల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రొనాల్డో తన సోషల్ మీడియాలో అకౌంట్ ద్వారా తెలిపాడు. ‘అప్పుడే పుట్టిన మా బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని విషాదం. మరో పాప బతికి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు మాకు కొంత ఆశ, ఆనందాన్ని ఇవ్వగలదు. […]
ఆటను, ఆటగాళ్లను అభిమానిస్తే తప్పులేదు. కానీ.. ఆ అభిమానం ముదిరి పిచ్చిగా మారి హద్దులు దాటితే ఘర్షణలు తలెత్తుతాయి. చివరికి చిన్నచిన్న కారణాలతో ప్రాణాలు పోయేవరకు వెళ్తుంది. తాజాగా మెక్సికోలోని క్వెరెటారో నగరంలో జరిగిన మెక్సికన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ ఒక చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. బాంబులు, తుపాకులు లేవుకాని.. భీకర పోరు మాత్రం జరిగింది. క్వెరెటారో, అట్లాస్ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 62వ నిమిషంలో స్టాండ్స్‌లో అభిమానుల […]
మనం నిత్యం తినే పదార్థాలు, తాగే నీటి కోసం ఖర్చు చేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఆస్పత్రిల్లో కొద్ది ఖర్చులో ఆక్సిజన్ తీసుకుంటాం. కానీ ఓ స్టార్ ప్లేయర్ గాలి కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. అదేంటి స్వేచ్ఛగా పీల్చుకోవడానికి వాతావరణంలో గాలి ఉంది కదా! మరి ఇంత ఖర్చు ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నారా? ఆ గాలికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక ఇంత భారీగా ఖర్చు పెట్టి గాలిని కొనుగోలు చేసింది […]
ఎలుగుబంట్లు కూృర జంతువులే కావచ్చు, కానీ వాటికి కూడా సరదాగా ఆడుకోవాలని ఉంటుందా? అంటే నిజమే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. రెండు ఎలుగుబంట్లు తమకు దొరికిన ఫుట్‌బాల్‌తో ఆడుకున్నాయి. నోటితో కాళ్లతో దాన్ని తంతూ హుషారుగా గడిపాయి. ఈ ఫన్నీ ఘటన ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఉమర్‌కోట్ ప్రాంతంలోని సుకిగావ్‌లోని అటవీ ప్రాంతంలో జరిగింది. ఆ ఆటను వీడియో తీసిన వాళ్లు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది తెగ వైరల్ అవుతుంది. ఎలుగుబంట్ల […]