ఊరు, వాడ, వీధి అన్నిచోట్ల వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చాలా ఘనంగా అందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపట్లో వినాయకచవితి అనగానే అందరికీ డీజేలు, తీన్‌మార్‌లు కామన్ అయిపోయింది. అలాగే అప్పటివరకు హుషారుగా స్టెప్పులేసిన ఓ కుర్రాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఇదంతా అనంతపురం జిల్లా గుత్తిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గౌతమిపుర కాలనీలో వినాయకుడి మండపం వద్ద కుల్లయ్య అనే యువకుడు డాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఉప్పెన సినిమాలోని పాటకు నృత్యం చేస్తూ.. నన్ను తీరానికి లాగే దారం దారం అంటూ ఆ కుర్రాడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతను ఎందుకు మరణించాడో తెలియరాలేదు. స్థానికులు డాన్స్ చేసి ఆయాసం రావడమో.. గుండెపోటుతోనే మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ వీడియో చూసిన అందరూ భక్తిశ్రద్ధలతో పండుగల చేయండి. సరదాలుక పోయి ప్రాణాలమీదకు తెచ్చుకోకండి అంటూ సూచిస్తున్నారు.