ఈ మధ్యకాలంలో యువకుల పిచ్చి చేష్టలు బాగా ఎక్కువయిపోయాయి. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటం కోసమో.. ఫ్రెండ్స్ ముందు తమ సత్తా చాటటం కోసమో చాలా మంది బైక్ స్టంట్లు చేస్తూ ఉన్నారు. తాజాగా, ఓ ఇద్దరు యువకులు లేడీస్ బస్ ముందు స్టంట్లు చేసి ఇబ్బందుల పాలయ్యారు.
సినిమా వేరు జీవితం వేరు.. సినిమాల్లో హీరో, హీరోయిన్‌ను ఇంప్రెస్ చేయటానికి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు. అది సినిమా కాబట్టి హీరోయిన్ అతడి చేష్టలకు ఇంప్రెస్ అయి లవ్‌లో పడుతుంది. అయితే, సాధారణ జీవితంలో అలా జరగదు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయటానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇందుకు తాజా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఓ ఇద్దరు యువకులు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటానికి వారి బైకులతో లేడీస్ బస్ ముందు స్టంట్లు చేశారు. బైక్ రేసింగ్‌కు సైతం పాల్పడ్డారు. చివరకు ఊహించని రీతిలో జైలు పాలయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడులోని శాతాన్‌కులం, తూత్తుకూడి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కాలేజ్‌లో పెద్ద సంఖ్యలో అమ్మాయిలు చదువుతున్నారు. కాలేజ్ అయిపోయిన తర్వాత వారంతా ఓ వ్యాన్‌లో తమ ఊళ్లకు తిరిగి వెళుతూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం ఓ ఇద్దరు యువకులు అమ్మాయిలు వెళుతున్న వ్యాన్‌ను ఓవర్ టేక్ చేసి, బైక్ రేసింగ్‌కు పాల్పడ్డారు. టీషర్ట్స్ ధరించి ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు తమ బైకులపై స్టంట్లు కూడా చేశారు. లోపల ఉన్న అమ్మాయిలను చూసి మరింత రెచ్చిపోయారు. అయితే, వీరి చేష్టలకు ఓ అమ్మాయికి కోపం వచ్చింది. వారి బైక్ స్టంట్లను వీడియో తీయటం ప్రారంభించింది.
ఈ విషయం తెలియని వారు తమకిష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. తర్వాత వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బైక్ నెంబర్ల ఆధారంగా ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దర్నీ కూలీ పనులు చేసుకునే వారిగా పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా వారు ఆ బైకులను కొన్నట్లు విచారణలో తేలింది. తరుచుగా వారు అమ్మాయిలు వెళ్లే వాహనాల ముందు స్టంట్లు చేస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆ యువకుల బైక్ స్టంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.