ఎంతో ఆశపెట్టుకుని చేసిన ఏదైన పని సరిగ్గా జరగకపోయినా.. వివిధ కారణాలతో ఆగిపోయిన ఎవరికైన కోపం వస్తుంది. ఇంకా బాగా బాధిస్తే రోజంతా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోతారు. సర్వసాధారణంగా ఎవరైనా చేసే పని ఇది. అయితే కొందరు మాత్రం తమకు నచ్చినట్లు జరగకపోయినా, తమ పనికి అంతరాయం కలిగి పిచ్చిఎక్కినట్లు , కోపంతో ఘోరంగా ఇతరుల పట్ల దారుణం గా ప్రవరిస్తుంటారు. తాజాగా ఓయువతి కూడా అలానే ప్రవర్తించింది. తాను ప్రయాణించాల్సిన విమానాన్ని.. తనిఖీ కారణం ఆలస్య కావడంతో మిస్సైంది. దీంతో అక్కడి మహిళ ఉద్యోగులపై దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దక్షిణ అమెరికా ఖండం మెక్సికో దేశంలోని ఎమిరేట్స్ అనే అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వ్యక్తిగత ప్రయాణ నిమిత్తం ఓ యువతి వెళ్లింది. అక్కడి భద్రతా అధికారులు తనిఖీల నిమిత్తం ఆ యువతిని అడ్డుకున్నారు. దీంతో ఆమె ఫ్లైట్ మిస్సైయింది. దీంతో ఆమెకు పట్టరాని కోపం వచ్చి.. అక్కడి వస్తువులను చిందరవందరగా పడేసింది. అంతడితో ఆగక అడ్డు వచ్చిన మహిళ అధికారిపై పిడి గుద్దులతో దాడి చేసింది. అక్కడ ఉన్న కంప్యూటర్లను విసిరేస్తూ వీరంగం సృష్టించింది. అధికారులు తనిఖీల పేరుతో తన జర్నీ వాయిదా పడేందుకు కారణం అయ్యారంటూ సదరు యువతి ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలపై ఎయిపోర్టు అధికారులు స్పందించారు.
ఆమె గడువు ముగిసిన పాస్ పోర్ట్ తో ఎక్కేందుకు ప్రయత్నించడంతో విమానంలోకి వెళ్లకుండా అడ్డుకున్నామని అధికారులు తెలిపారు. తాము అడ్డుకున్నామన్న కోపంతో ఆమె తమపై దుర్బాషలాడి, దాడి చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ..వారిపై కూడా వస్తువులు విసిరేస్తూ పెద్ద హంగామా సృష్టించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువతిపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేసున్నారు. ‘చేసిందే తప్పు.. మళ్లీ అధికారులపైనా నీ ప్రతాపం?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Moment woman throws punches at Emirates airline employee and hurls objects at bystanders after
missing her flight at #MexicoCity airport pic.twitter.com/sHsPEKkWzl— Hans Solo (@thandojo) November 7, 2022