viral video : కాలం మారింది.. 2K కిడ్స్ సూపర్ ఫాస్ట్‌గా తయారయ్యారు. 90 కిడ్స్ చదువు విషయంలో గురువులతో ఎన్ని దెబ్బలు తిన్నా సైలెంట్‌గా ఉండేవారు. ఒకరో ఇద్దరో కోపంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసేవారు. తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదు. దెబ్బలు పడితే పడ్డాయి.. చదవు అబ్బితే సరి అనుకునేవారు. కానీ, 2K కిడ్స్ అలా లేరు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంటున్నారు. తమకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోమంటున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే చాలా సంఘటనలను మనం ఇదివరకు చాలా చూశాం.
తాజాగా కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. తనను కొడుతున్నాడన్న కోపంతో గురువుపై పోలీసులకు ఫిర్యాదు చేసాడో పిల్లాడు. నవీన్ నాయక్ అనే పిల్లాడు ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సార్‌పై కంప్లైంట్ ఇచ్చాడు. స్కూల్లో సార్ ఎప్పుడూ తనను కొడుతున్నాడంటూ వచ్చీ రాని మాటలతో ముందున్న లేడీ పోలీస్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.