కోపం మనిషిని మృగంలా మార్చేస్తోంది. ఆ క్షణికావేషంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక జీవితం అంతా సరిపోదు. ఇక మనలో చాలా మంది కోపం రాగానే చేతిలో ఉన్న వస్తువులను పగలకొడుతుంటారు. చాలా మంది సెల్ ఫోన్స్ విసిరికొట్టి, తరువాత బాధపడుతుంటారు. కానీ.., ఇక్కడ ఓ ప్రభుద్దిడి కోపానికి రూ.8 కోట్ల పోర్ష్ కారు నాశనం అయిపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.., కెంట్ సిటీ డోవర్‌లోని ఫోక్ స్టోన్ రోడ్డు. ధనికులు నివశించే ప్రాంతం. పదుల కోట్లు విలువ చేసే కార్లు అక్కడ రోడ్డుకి పక్కన పార్క్ చేసి ఉంటారు. ఎప్పుడు అక్కడ కనీసం దొంగతనం లాంటి సంఘటన కూడా జరిగింది లేదు. ఆ ధైర్యంతోనే అందరూ తమ కార్లని అక్కడే పార్క్ చేస్తారు.
తాజాగా ర్యాన్ హ్యామ్ బ్రూక్ అనే బైకర్ కెంట్ సిటీ డోవర్‌లోని ఫోక్ స్టోన్ రోడ్డుపై వెళ్తుండగా ఓ వింత సంఘటన చూశాడు. రోడ్ కి పక్క భాగంలో ఓ వ్యక్తి పెద్ద సైజు రెంచ్ సాయంతో పోర్ష్ కారును నాశనం చేస్తూ కనిపించాడు. పోర్ష్ 911 మోడల్ అయిన ఆ కారు చాలా అందంగా ఉంది. ఆ కార్ విలువ సుమారు 8 కోట్ల పైనే ఉంటుంది. ఆ కార్ ని అతను నిమిషాల వ్యవధిలోనే నాశనం చేసేశాడు. అతని దెబ్బకి నలుపు రంగు పోర్ష్ కారు బానెట్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఫుట్ పాత్‌పై మరో ఇద్దరు నిలబడి.. కార్ పగలకొట్టే అతన్ని ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. ర్యాన్ హ్యామ్ బ్రూక్ ఏ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.
ఈ వీడియో పోలీసుల వరకు చేరడంతో విచారణ ప్రారంభించారు. కానీ విచారణలో వారికి దిమ్మ తిరిగిపోయే నిజం తెలిసింది. డ్యామేజ్ చేసిన వ్యక్తిపై కేసు అవసరం లేదని చెప్పాడట ఆ కార్ ఓనర్ . ఎందుకంటే ఆ కారును డ్యామేజ్ చేయమని కోరింది తానేనట. ఆ సమయంలో తాను కోపంగా ఉన్నానని, అందుకే తన కారుని నాశనం చేయమని చెప్పినట్టు అతను పోలీసులకి చెప్పినట్టు తెలుస్తోంది. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.