Scorpions: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుని ఎక్కడెక్కడో జరిగిన వింతలు, విశేషాలు.. నేరాలు, ఘోరాలు ఇలా అన్నింటిని తెలుసుకోగలగుతున్నాము. నెట్టింట ప్రతీ రోజు ఏదో ఒక కొత్త విషయం పరిచయమవుతూనే ఉంటుంది. తాజాగా, ఎవరూ లేని ఓ ఇంట్లో వేల కొద్దీ తేళ్లు దర్శన మిచ్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అరలు, అరలుగా ఉన్న గదుల్లాంటి వాటిలో గుట్టలు గుట్టలుగా తేళ్లు నిండిపోయాయి. ఓ వైపు గోడలు సైతం కనిపించనీయకుండా అవి వాటిని కప్పేశాయి. అవి అటు, ఇటు తిరుగుతుంటే చూసే వాళ్ల ఒళ్లు గగుర్పొడవక మానదు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు.
ఈ వీడియోను గోలెఫ్ట్ దెన్ లెఫ్ట్ ఎగైన్ అనే రెడ్డిట్ ఖాతా దారుడు షేర్ చేశాడు. వీడియో లక్షల సంఖ్యలో వ్యూస్ సంపాదించుకుంది. 33 వేలకుపైగా అప్ఓట్స్ సొంతం చేసుకుంది. ఓ నెటిజన్ దీనిపై స్పందిస్తూ.. ‘‘ ఆ తేళ్ల జాతి పేరు టైటస్ సెర్రులటస్. అవి బ్రెజిల్‌కు చెందినవి. ఈ జాతి తేళ్లు కలయిక లేకుండా పిల్లల్ని కంటాయి.. సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి’’ అని చెప్పుకొచ్చాడు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Snakes: మట్టి కుండలో బయటపడ్డ వందల కొద్దీ నాగు పాములు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.