రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి ఆ దిశగా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎన్నో ప్రచారం చేస్తున్నా.. వాహనదారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మూల మలుపుల్లో, టర్నింగ్ పాయింట్లలో డైరెక్షన్ లు బోర్డులను ఏర్పాటు చేస్తున్నా ప్రమాదాలు మాత్రం చోటు చేసుకుంటునే ఉన్నాయి.
ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా రోజుకు ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఓ టర్నింగ్ పాయింట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ వెళ్తూ ఉంది. కాగా డ్రైవర్ అతి వేగంగా రావడంతో టర్నింగ్ వద్ద వ్యాన్ వెనక ట్రక్కు ఒక్కసారిగా పూర్తిగా ఊడిపోయి కింద పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న జనాలంతా ఒక్కసారిగా కిందపడిపోయారు.
ఇది కూడా చదవండి: Video: పాపం ఎంగేజ్ మెంట్ రోజే అల్లరిపాలయ్యాడు..!
ఈ ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు వారిని లేపే ప్రయత్నం చేశారు. ఇక కింద పడ్డ జనాలంతా అందరూ ఒకరి తర్వాత ఒకరు మెల్లగా లేచారు. ప్రమాద సమయంలో వెనక నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలతో అందరూ ప్రాణాలతో భయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
టర్నింగ్ లో దిగుతాం అంటే…. 🥶🥶🥶🥶 pic.twitter.com/AW4DtC1rIa
— ₿𐌷@$₭ɑ® (@shivsun) May 30, 2022