అద్భుతాన్ని నిజమని నమ్మడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అద్భుతం అన్నీ వేళల జరిగేది కాదు. కానీ.., పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి అద్భుతం ఇప్పుడు నిజం అవుతుంది. వీటిలో చాలా విశేషాలకి మన తెలుగు రాష్ట్రాలే వేదిక అవుతున్నాయి. ఏనుగు కడుపున పంది పుడుతుందని, పంది కడుపున పిల్లి పుడుతుందని, వింత ఆకారంలో ఆవు దూడలు, మేక పిల్లలు పుడతాయని ఆయన కాలజ్ఞానంలో ఎప్పుడో తెలియచేశారు. ఇలాగే.., మేక కడుపున మనిషి పుడతాడని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. కానీ.., ఇప్పటి వరకు ఇలాంటి ఘటన ఎక్కడా చోటు చేసుకోలేదు. దీంతో.., ఈ వింత భవిష్యత్ కాలంలో జరగవచ్చని అంతా భావించారు. కానీ.., అందరికీ షాక్ ఇస్తూ..తాజాగా ఇలాంటి ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. భైంసా మండలం సుంక్లి గ్రామంలో ఓ పశువుల కాపరి ఉన్నాడు. మేకల మందని మేతకి తోలుకొని పోవడం, తీసుకొని రావడం అతని పని. కాగా.., ఈ సోమవారం కూడా అతను మేకలను ఇలాగే అడవికి తోలుకునిపోయాడు.
కానీ.., కొన్ని మేకలను మాత్రం ఇంటి వద్దే ఉంచేశాడు. అవన్నీ పిల్లలని ఈనడానికి సిద్ధంగా ఉండటంతో ఇంటి వద్దే కట్టేసి ఆహరం పెడుతున్నాడు. కానీ.., సోమవారం కాపరి అడవి నుండి వచ్చేసరికి ఆ పశువుల కొట్టంలో అద్భుతం చోటు చేసుకుంది. మందలో కడుపుతో ఉన్న ఓ మేకకి వింత మేక పిల్ల జన్మించింది. మనిషిని పోలిన పిల్లను మేక ప్రసవించించింది. ఆ మేక తల, కాళ్లు, చేతులు మనిషిని పోలిన విధంగానే ఉన్నాయి. మనం బోర్లా తిరిగి నిద్రిస్తే ఎలా ఉంటామో ఆ మేక పిల్ల కూడా అదే ఆకారంలో ఉండటం విశేషం. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వింతమేకను చూడటానికి తరలి వచ్చారు. అయితే ఈ వింత మేక పుట్టిన కోద్ది సేపటికి ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి వింత శిశువు జన్మించడానికి జన్యు ఉత్పరివర్తనాలు కారణమంటున్నారు పశువైద్య నిపుణులు. గతంలో కూడా కొన్ని మేకలు చాలా వింత ఆకారంతో పుట్టిన సందర్భాలు ఉన్నాయి. రెండు తలలతో పుట్టిన మేక, ఎక్కువ కాళ్ళతో పుట్టిన మేకలు చాలానే ఉన్నాయి. కానీ.., ఇంత పెర్ఫెక్ట్ గా మనిషి ఆకారంతో మేక జన్మించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.