ఎక్కువమంది వాడే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మరోసారి స్తంభించింది. భారత్ సహా పలు దేశాల్లో ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రాం సేవలు బుధవారం అర్ధరాత్రి నిలిచిపోయాయి. నెల రోజలు క్రితం దాదాపు 6 గంటల పాటు డౌన్ అయిన ఫేస్‌బుక్ కంపెనీ సేవలు ఇప్పుడు మళ్లీ పనిచేయడం ఆగిపోయాయి. దీంతో నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. ఫేస్‌బుక్‌ను వదిలి వేరే వాటికి మారిపోతాం అని ట్వీట్టర్ వేదికగా హెచ్చరించారు. ఇక మీమర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడా మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడం విశేషం.
‘డౌన్ డిటెక్టర్’ రిపోర్ట్ ప్రకారం.. భారతలో బుధవారం అర్ధరాత్రి 12:01 నిమిషాల సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ సర్వీసులు కొన్ని గంటల పాటు ఆగినట్లు సమాచారం. దీంతో భారత్‌తో పాటు యూఎస్,యూకే దేశాలకు చెందిన యూజర్లు ఫేస్‌బుక్‌కు ఫిర్యాదులు చేశారు. దీనిపై “ఫేస్‌బుక్ ఈఎంఈఏ కమ్యూనికేషన్ మేనేజర్ అలెగ్జాండ్రూ వాయిస్కా స్పందించారు. బగ్‌ను గుర్తించి త్వరలోనే సేవల్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. మెసేజింగ్ సర్వీసులు నిలిచిపోయినందుకు క్షమించండి అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్ అఫిషియల్ అకౌంట్ నుంచి బుధవారం అర్ధరాత్రి 1.33గంటలకు మెసేజ్ చేశారు. ఆ తరువాత మరోసారి తెల్లవారు జామున 4.34 గంటల ప్రాంతంలో వీఆర్ బ్యాక్. బగ్‌ను గుర్తించి, సమస్యను పరిష్కరించామంటూ” మెసేజ్ చేశారు.
Twitter striving while insta got clapped again #instagramdown pic.twitter.com/n4qDAcJXi5
— 💫𝓚𝓸𝓪𝓵𝓪💫 (@PapaKoalaYT) November 3, 2021
and once again, this bird app proves that it’s the superior social media app 😌 #messengerdown #facebookdown #instagramdown pic.twitter.com/n4sYjrUw2E
— Astro • studying 📌 (@kristsupremacy) November 3, 2021
Zuckerberg right now #instagramdown pic.twitter.com/k2bd7rPVDQ
— Alex Culé (@alexculee) November 3, 2021