సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్లు ఏం చేసినా అది సెన్సేషన్ అవుతుంది. వారి పెళ్లిళ్లు జరిగినా- విడిపోయినా నెట్టింట మోత మోగిపోతుంది. అయితే ఆ వార్తలు ముందుగా ఆ నోటా ఈ నోటా పాకి వైరల్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సెలబ్రిటీ జంట మాత్రం అందుకు భిన్నంగా తమ బ్రేకప్ ని ఒక అద్భుతమైన వీడియోగా రూపొందించి మరీ విడిపోతున్నట్లు తెలియజేశారు.
నాస్ డైలీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎంతో మందికి ఈ పేరు, ఈ వ్యక్తి కచ్చితంగా తెలిసే ఉంటాడు. ఫేస్ బుక్ లో వన్ మినిట్ వీడియోలతో ఎంతో ఫేమస్ అయ్యాడు. ఎంతో మంచి ఉద్యోగాన్ని వదిలేసి.. 2016లో ఫేస్ బుక్ పేజ్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వెయ్యి రోజులపాటు రోజుకో వన్ మినిట్ వీడియోలు పోస్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యాడు. ‘దట్స్ వన్ మినిట్ సీయూ టుమారో’ అంటూ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ పోస్ట్ చేస్తుండేవాడు. ఇంత ఫేమస్ అయిన నాస్ తన జీవితంలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతను తన భార్యతో విడిపోతున్నాడు. ఆ విషయాన్ని కూడా వీడియో చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
2016లో ఫేస్ బుక్ పేజ్ స్టార్ట్ చేయగా.. నాస్ డైలీకి 2018లో 10 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఆ తర్వాత ఆ సంఖ్య ఇప్పుడు 21 మిలియన్ కు చేరింది. ఇతను సాధారణంగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా అప్పుడప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా ఒక వీడియో పోస్ట్ చేయగా.. అతని ఫాలోవర్స్ ని బాధకు గురిచేస్తోంది. ఎందుకంటే అతను తన భార్య అలైన్ తో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు. తనని ఇంత ఫేమస్ చేసిన, ఇంత దూరం తీసుకొచ్చిన ఫాలోవర్స్ తో సంతోషాన్ని పంచుకున్నాను.. నా లైఫ్ లో కఠిన నిర్ణయాన్ని కూడా మీతో పంచుకోవాలి అపించింది. అందుకే ఇలా వీడియో చేశాం అంటూ నాస్ డైలీ చెప్పుకొచ్చాడు.
నాస్- అలైన్ మధ్య ఆరేళ్ల తర్వాత పరిచయం ఏర్పడింది. నాస్ అప్పుడే వీడియోలు చేయడంలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అలైన్ కూడా భర్తతో విడాకులు తీసుకుని దేశాలను చుట్టేయడం ప్రారంభించింది. అలైన్ వీడియోలు చూసి నాస్ తనను సంప్రదించాడు. మనిద్దరం కలిస్తే ఎంతో బాగుంటుంది అంటూ ఆమెతో డేట్ కి వెళ్లాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఒకసారి కాదు.. భారత్ లో ఒకసారి, పపువా న్యూ గినియాలో రెండోసారి వివాహం చేసుకున్నారు. అయితే వారి మధ్య కొన్నాళ్లుగా విభేదాలు తలెత్తాయి. నాస్ అసలు తనని పట్టించుకోవడం లేదంటూ అలైన్ బాధ పడటం ప్రారంభించింది. వారికి చాలా విషయాల్లో గొడవలు కూడా జరిగాయి. ఆ మొత్తం విషయాన్ని ఒక వీడియోగా చేసి తమ పేజ్ లో పోస్ట్ చేశారు. ఇది చూసిన తర్వాత వారి ఫాలోవర్స్ ఎంతో బాధ పడుతున్నారు. అయితే తాము ఎప్పటికీ మంచి మిత్రులుగా ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు. నాస్ డైలీ- అలైన్ బ్రేకప్ వీడియో చూసేందుకు క్లిక్ చేయండి.