తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పల్సర్ బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి బ్రేకులు ఫేల్ అవ్వటంతో సడెన్ గా ఆ బైక్ బట్టల దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి షాపులో ఎగిరిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరం పరిధిలోని రావిచెట్టు ప్రాంతానికి చెందిన ఓ వక్తి తన పల్సర్ బైక్ తో కమాన్‌బజార్ లోకి వచ్చాడు. ఇక అతి వేగంగా వెళ్తున్న క్రమంలో సడెన్ గా బైక్ బ్రేక్ లు ఫేల్ అయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఆ బైక్ రోడ్డు పక్కనున్న బట్టల షాపులోకి దూసుకెళ్లింది. ఇక ఆ షాపులో ఉన్న వ్యక్తులకు ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆ షాపులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.