తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అధిక వేడి వల్ల అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతతో వేడిగాలులు వీస్తున్నాయి. ఎండ తీవ్రతకు పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై వెళ్తున్న వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం.. టైర్లు పగిలిపోవడం.. పలు చోట్ల విద్యుత్ షాట్ సర్క్యూట్స్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఖమ్మం పత్తి మార్కెట్ లో శనివారం మధ్యాహన్నం అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా పత్తి మార్కెట్ లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పత్తి బస్తాలు నిల్వ చేసిన గోదాములో మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సుమారు 1600 బస్తాలు బూడిద అయినట్లు తెలుస్తుంది.దట్టంగా పొగలు కమ్మేయడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. మార్కెట్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదం వల్ల రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి వ్యాపారికి దాదాపు 1.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.