తెలుగు ఇండస్ట్రీలో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో ఎన్నో అద్బుతమైన పాత్రలకు ప్రాణంపోసిన మహానటులు ఎన్టీఆర్.. వెండితెరపైనా కాదు.. రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చాటుకున్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి పేద ప్రజల గుండెల్లో ‘అన్న’గా సుస్థిర స్థానం సంపాదించారు.
తెలుగు ఇండస్ట్రీలోనే సాటిలేని కథానాయకడిగా కోట్ల మంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు సీనియర్ ఎన్టీఆర్. పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాలు ఏవైనా సరే ఆయన నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుందని అంటారు. విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు అందరూ అభిమానులు ఆయనను ఎన్టీఆర్ అంటారు. కేవలం నటుడిగానే కాకుండా తెలుగు వాళ్ల ఆత్మగౌరవం కోసం తెలుగు దేశం పార్టీ ని ఏర్పాటు చేసి ఎన్నో వినూత్న పథకాలు అమలు చేసి సామాన్య ప్రజలకు చేరువయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన శిలా విగ్రహాలు ఏన్నో నిర్మించారు. తాజాగా ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్ మద్యలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడను జూనియర్ ఏన్టీఆర్ కలిశారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా, టీడీపీ వ్యవస్థాపప అధ్యక్షుడు.. తెలుగు ప్రజలు ఎంతో అభిమానంగా ‘అన్న’ అని పిలిచే సీనియర్ ఎన్టీఆర్ నిలువెత్తు రూపం ఖమ్మంలో తుదిమెరుగులు దిద్దుకుంటుంది. తానాతో పాటు ఎన్టీఆర్ అభిమానులు విరాళాలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 28న ఎన్టీఆర్ శతజయంతి రోజున ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ మద్యలో మొత్తం బెస్ మెంట్ తో కలిపి 52 అడుగుల శ్రీకృష్ణావతారంలో భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ విగ్రహం పనులు తుదిదశకు చేరుకుంది. ఎన్టీఆర్ శతజయంతి రోజున ఎన్టీఆర్ మనువడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో భారీ స్తాయిలో ఈ వేడుక జరుగనుంది.
ఖమ్మం జిల్లాలో మే 28 న జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, మంత్రి పువ్వాడ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. సుమారు నాలుగు కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఎన్టీఆర్ విగ్రహంతో ఖమ్మం జిల్లాకు మరింత శోభని తెస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఎన్టీఆర్ విగ్రవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు.
#NTR100Years @ Khammam
Transport Minister Of Telangana State @puvvada_ajay Met @tarak9999 Garu Today & Discused About Sr NTR’s 56 Feet Statue Inauguration Ceremony At Khammam On May 28th 2023.#ManOfMassesNTR pic.twitter.com/KsMPOV8ETL
— vpr (@PrVpr) May 2, 2023