ప్రపంచం అంతా నీలో తప్పులను, లోపాలను ఎత్తి చూపినా సరే.. అమ్మ మాత్రం తన బిడ్డని మహారాజులానే చూస్తుంది. కాబట్టి.. అమ్మ మాత్రమే ఎలాంటి స్థితిలో అయినా మనలని ఆనందంగా ఉంచగలదు. సరిగ్గా.. ఈ విషయం మరోసారి రుజువైంది. మానసికంగా ఇబ్బంది పడుతున్న తన బిడ్డ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది ఓ తల్లి. అతను వయసులో పెద్ద వాడైనా ఆటిజంతో ఇబ్బంది పడుతూ.. ఇంకా చిన్న పిల్లాడిలానే వ్యవహరిస్తున్నాడు. దీంతో.., ఇల్లంతా డెకరేషన్ తో, బెలూన్స్ తో నింపేసింది ఆ తల్లి. తన పుట్టినరోజు ఇంత గ్రాండ్ గా జరుగుతుండటంతో అతని ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
అయితే.. ఈ సందర్భంగా తన కొడుక్కి ఓ “రియల్ మీ” స్మార్ట్ ఫోన్ ని గిఫ్ట్ గా అందించింది ఆ తల్లి. అప్పటి వరకు తన చుట్టూ పక్కల వాళ్ళు ఫోన్స్ వాడటం తప్ప.., అతనికి అంటూ సొంత ఫోన్ లేదు. కానీ.., ఆమె ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ తన చేతిలో పెట్టే సరికి.., ఆ కొడుక్కి పట్టరాని ఆనందం వచ్చేసింది. తన్నుకొస్తున్న భావోద్వేగాన్ని ఆపుకుంటూ అతడు ఈ వీడియోలో చాలా మ్యూచ్యుర్డ్ గా కనిపించాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు.. అతను ఆనందపడ్డ విధానానికి ముగ్ధులు అయిపోతున్నారు. దీంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా.. చివరికి ఈ వీడియో “రియల్ మీ” సీఈఓ వద్దకి చేరడంతో ఆయన కూడా స్పందించాడు.
మా రియల్ మీ టెక్నాలజీ.. ప్రజల్లో ఇలా ఆనందాన్ని నింపుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆ కుర్రాడికి మా సంస్థ నుంచి రియల్ మీ ప్యాడ్ బాహుబతిగా అందిస్తాము. హ్యాపీ బర్త్‌డే.. అంటూ సంస్థ సీఈఓ మాధవ్ శేత్.. ట్వీట్ చేశాడు. ప్రస్తుతం.. ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. సంస్థ సీఈఓ నే కదిలించిన ఈ అమ్మ ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.
Glad to see realme technology empowering people and bringing joy to them.
I would like to gift this beloved kid our upcoming product to make his birthday more special. Hope #realmePad helps him with online education and have fun from all the Entertainment. Happy birthday! https://t.co/B3Et5hR3mJ
— Madhav Sheth (@MadhavSheth1) September 8, 2021