ప్రతి మనిషికి కోరికలు ఉండటం సర్వసాధారణం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి. చాలా మంది ఆశలు ఆకాశానికి.. సంపాదనేమో పోషణకే సరిపోదు. దీంతోచాలా మంది తమ కోరికలను చంపుకుని జీవితాన్ని సాగిస్తుంటారు. కానీ.. కొందరు మాత్రం ఏదో విధంగా తమ కోరికలను తీర్చుకుంటారు. తాజాగా ఓ వ్యక్తికి హెలికాప్టర్ లో తిరగాలని చిన్నప్పటి నుంచి ఆశ. అయితే కానీ అందరిలా కోరికతోనే ఉండిపోలేదు. తన దగ్గర ఉన్న కారునే హెలికాప్టర్ గా మార్చుకుని కోరికను తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్ రాష్ట్రంలోని భగల్ పూర్ లోని తిలక్ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి.. తన దగ్గర ఉన్న నానో కారుతో ఎగరని హెలికాప్టర్ ను తయారు చేశారు. దీని కోసం లక్ష రూపాయలను ఖర్చు చేశాడు. ఎందుకు కారు అలా మార్చారు అని అడగ్గా.. తనకు హెలికాప్టర్ లో ప్రయాణించాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉందని. కానీ కారు కొనే స్తోమత మాత్రమే ఉంది. అయిన కోరికను చంపుకోలేక ఇలా హెలికాప్టర్ తయారు చేయించుకున్నాని తెలిపారు.వందల కోట్లు పెట్టి గాల్లో ఎగిరే హెలికాప్టర్ కొనలేక లక్ష రూపాయలు పెట్టి భూమి మీద తిరిగి హెలికాప్టర్ తయారు చేయించాడు. ఈ వెరైటి వాహనాన్ని చూసిన స్థానికులు.. ఎలా చేయించావు భయ్యా. నీవు సూపర్ అంటూ సదరు వ్యక్తిని పొగడ్తలతో ముంచారు. ఈ ఎగరని హెలికాప్టర్ చూసేందు స్థానికులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.